TG NEWS: ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం.. వైద్యం వికటించి బాలిక మృతి
ABN, Publish Date - Oct 07 , 2024 | 08:48 AM
హనుమకొండలో తాజాగా మరో సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డాల్ఫిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో వైద్యం వికటించి బాలిక మృతిచెందింది. ఈనెల 2వ తేదీన జ్వరంతో డాల్ఫిన్ హాస్పిటల్లో ములుగు జిల్లాకు చెందిన వర్షిత చేరింది. వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందిందంటూ ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు బైఠాయించి ఆందోళనకు దిగారు.
హనుమకొండ: పలు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్లక్ష్యం రోగుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం అలసత్వాన్ని వదలడం లేదు. దీంతో పలువురు రోగులు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో పేషంట్లు చనిపోయిన సంఘటనలను కూడా చూస్తునే ఉన్నాం. వైద్య శాఖ అధికారులు అడప దడప ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీస్తున్నారు. అధికారుల ఉదాసీనత వైఖరితో ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు ఇష్టారీతిగా వ్యవహారిస్తున్నారు.
హనుమకొండలో తాజాగా మరో సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డాల్ఫిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో వైద్యం వికటించి బాలిక మృతిచెందింది. ఈనెల 2వ తేదీన జ్వరంతో డాల్ఫిన్ హాస్పిటల్లో ములుగు జిల్లాకు చెందిన వర్షిత చేరింది. వైద్యుల నిర్లక్ష్యంతో బాలిక మృతి చెందిందంటూ ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు బైఠాయించి ఆందోళనకు దిగారు. రాత్రి డాల్ఫిన్ ఆస్పత్రి అద్దాలను మృతురాలి బంధువులు ధ్వంసం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.డాల్ఫిన్ ఆస్పత్రిలో నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. ఈ ఆస్పత్రిపై ప్రజలు పలు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్..
CM Revanth Reddy: ఎవరు అడ్డొచ్చినా ఆగదు..
Kishan Reddy: గోవా రైలుకు పచ్చజెండా
Hanumakonda: పిడుగుపాటుకు ఇద్దరి మృతి
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 07 , 2024 | 09:53 AM