Telangana: ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే : కూనంనేని
ABN, Publish Date - Aug 25 , 2024 | 10:51 AM
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.
వరంగల్, ఆగష్టు 24: ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం నడుస్తున్న విధానంపై అసహనం వ్యక్తం చేశారు. మంత్రుల్లో సమన్వయ లోపం కనిపిస్తోందని విమర్శించారు. ఒకరు చెప్పినదానికి.. మరొకరు చెప్పినదానికి సంబంధం ఉండటం లేదన్నారు. ఈ లోపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దుకోవాలని సూచించారు.
రుణమాఫీపై రైతులు ధర్నాలు చేస్తే తాము మద్దతు ఇస్తామని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయకపోయినా ఇప్పటి ప్రభుత్వంపై రాళ్లు వేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో హైడ్రా అనే పేరుతో జనాలను భయపడుతున్నారని.. హైడ్రా నుంచి సామాన్యులకు విముక్తి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఉనికి కోసం పోరాడుతుందని.. ఇక బీఆర్ఎస్ కోలుకోవడం కష్టం అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ వీడేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారని.. సమయం కోసం వేచిచూస్తున్నారని కూనంనేని సాంబశివరావు అన్నారు. కానీ ఇది మంచి పద్ధతి కాదని.. పార్టీ మారిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కమ్యూనిస్టు పార్టీ మూడు రోజుల పాటు నిర్వహించిన కౌన్సిల్ సమావేశాలు విజయవంతం అయ్యాయని కూనంనేని సాంబశివరావు చెప్పారు. కమ్యూనిస్టులు లేని లోటును సమాజం గుర్తించిందని.. అందుకే కమ్యూనిస్టులకు ఆదరణ పెరుగుతోందన్నారు. గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు బీఆర్ఎస్ అడ్డుపడిందని.. అసెంబ్లీలో జిగుప్సాకరమైన పదజాలం ఉపయోగించడం మంచి పరిణామం కాదన్నారు. గతంలో బీఆర్ఎస్ తప్పులు చేయడం వల్లే ప్రజలు తిరస్కరించారని.. కాంగ్రెస్ ప్రభుత్వం దీనిని గుర్తించాలని సాంబశివరావు హితవు చెప్పారు.
Also Read:
ఆదివాసీ బియ్యం... ఆరోగ్యానికి అభయం!
ఐఎండీ హెచ్చరిక.. 20 రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..
వెంకటరెడ్డి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
For More Telangana News and Telugu News..
Updated Date - Aug 25 , 2024 | 10:51 AM