Seethakka: పైసా లేకుండా దర్శనం చేసుకునే ఏకైక జాతర మేడారం..
ABN, Publish Date - Feb 17 , 2024 | 03:06 PM
Telangana: పైసా లేకుండా దర్శనం చేసుకునే ఏకైక జాతర మేడారం అని మంత్రి సీతక్క అన్నారు. గతంలో కాలినడకన వచ్చేవారని... ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పధకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు.
ములుగు, ఫిబ్రవరి 17: పైసా లేకుండా దర్శనం చేసుకునే ఏకైక జాతర మేడారం అని మంత్రి సీతక్క (Minsiter Seethakka) అన్నారు. శనివారం మేడారంలో ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్‌ను ప్రారంభించిన మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గతంలో కాలినడకన వచ్చేవారని... ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పధకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. గతంలో కంటే డబుల్ బస్సులు ఈసారి 6 వేల బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ‘‘ఆర్టీసీ ఉద్యోగులకు, అధికారులకు నా విన్నపం ఓపికతో బస్సులు నడపండి, భక్తులతో మర్యాదగా వ్యవహరించాలి. ఆడుతూ పాడుతూ పని చేయాలని.. ప్రయాణం చేసే భక్తులు సంతోషంగా వచ్చి వెళ్లేలా చూడాలి’’ అని కోరారు. ఈరోజు నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయని మంత్రి సీతక్క వెల్లడించారు. బస్టాండ్ ప్రారంభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరిష్, పాల్గొన్న ఆర్టీసీ వరంగల్ ఆర్ ఎం శ్రీలత, స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్ పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Feb 17 , 2024 | 03:10 PM