Kadiyam Srihari: బండి సంజయ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన కడియం
ABN, Publish Date - Oct 21 , 2024 | 03:12 PM
Telangana: బండి సంజయ్ కేంద్ర మంత్రి అని మరిచిపోయి సిగ్గు లేకుండా నడిరోడ్లపై దాడులు చేస్తున్నారని.. జ్ఞానం ఉందా అంటూ కడియం శ్రీహరి విరుచుకుపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాల్సింది పోయి రోడ్డు మీద కూర్చోవడం పద్ధతేనా అని నిలదీశారు.
జనగామ, అక్టోబర్ 21: కేంద్రమంత్రి బండి సంజయ్‌పై (Union Minister Bandi Sanjay) స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (MLA Kadiyam Srihari) ఘాటు వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడతూ.. బండి సంజయ్ కేంద్రమంత్రి అని మరిచిపోయి సిగ్గు లేకుండా నడిరోడ్లపై దాడులు చేస్తున్నారని.. జ్ఞానం ఉందా అంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాల్సింది పోయి రోడ్డు మీద కూర్చోవడం పద్ధతేనా అని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధిపై బీఆర్‌ఎస్‌కు, బీజేపీకి ప్రేమ లేదని.. అధికారం కోసం పోటీపడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి చక్కగా పరిపాలిస్తున్నారని అన్న ఎమ్మెల్యే.. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు.
Group-1 Exams: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1 మెయిన్స్ ప్రారంభం
ఏడు లక్షల కోట్ల అప్పులలో రాష్ట్రం ఉందన్నారు. వడ్డీలు, జీతాలు, పెన్షన్లు, అభివృద్ధి కార్యక్రమాలకు మిగులుబాటు లేదని.. సర్దుబాటు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. రేవంత్ రెడ్డి సంకల్పానికి మనందరం సపోర్టుగా నిలవాలన్నారు. ఆయన ధైర్యంగా ముందుకు వెళ్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ మాయమాటలు నమ్మితే నష్టపోతామన్నారు. బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఐదేండ్లలో కల్వకుంట్ల కుటుంబం దోపిడి చేసిందని ఆరోపించారు. 2014లో కేసీఆర్ కుటుంబం మొత్తం ఆస్తులు ఎంత.. ఇప్పుడు కేసీఆర్ ఆస్తులు ఎంత.. దమ్ముంటే ప్రజల ముందుకు చర్చకు రావాలని సవాల్ విసిరారు. హరీష్ రావు నిజాయితీ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారు సిగ్గుందా అంటూ మండిపడ్డారు. జనగామలో ప్రతాపరెడ్డి నాయకత్వంలో వచ్చే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని ఆకాంక్షించారు.
Honey Trap Case: హనీ ట్రాప్ కేసులో కీలక అధికారి.. ఎవరంటే
10 ఏళ్లలో ఒక్క డీఎస్సీ నిర్వహించని బీఆర్ఎస్‌కు కాంగ్రెస్‌ను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అమాయకులైన నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు, కేటీఆర్‌లు.. బీజేపీ పార్టీలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారన్నారు. ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ముప్పేట దాడులు చేస్తున్నాయన్నారు. రేవంత్ రెడ్డి సంకల్పానికి ప్రతి ఒక్కరు అండగా నిలబడాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..
కాగా.. శనివారం (అక్టోబర్ 19) గ్రూప్-1 అభ్యర్థులు హైదరాబాద్‌లో నిర్వహించిన చలో సచివాలయం ముట్టడి ర్యాలీలో బండి సంజయ్ పాల్గొన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు ఉద్రిక్తత మధ్య జరిగిన ర్యాలీలో బండి సంజయ్‌ని పోలీసులు అదుపులో తీసుకొని.. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. జీవో నెంబర్ 29ని రద్దు చేసి జీవో నెం 55ను అమలు చేయాలంటూ నిరుద్యోగులు ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వీరి నిరసనకు బండి సంజయ్ మద్దతు తెలిపారు. బండి సంజయ్‌తో పాటు బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున అశోక్‌నగర్ చేరుకుని ఆందోళన చేస్తున్న అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేంద్రమంత్రిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. చివరకు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద బండిసంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి బీజేపీ కార్యాలయానికి కేంద్రమంత్రిని తరలించారు.
ఇవి కూడా చదవండి...
CM Revanth: వాటిపై దాడి చేస్తే వదలిపెట్టం.. సీఎం మాస్ వార్నింగ్
Etela Rajender: అంతా చేసింది పోలీసులే.. ఎంపీ సంచలన ఆరోపణలు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 21 , 2024 | 03:27 PM