Heavy Rains: భారీ వర్షం.. రైల్వే ట్రాక్‌లు ధ్వంసం..
ABN, Publish Date - Sep 01 , 2024 | 11:07 AM
ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి మహబుబాబాద్ వెళుతోంది. నెక్కొండ మండలం వెంకటాపురం వద్ద చెరువు మత్తడి పొంగిపొర్లుతుంది. తోపనపల్లి చెరువు పొంగి ప్రవహించడంతో కట్టపై ఉన్న బస్సు వరద నీటిలో నిలిచిపోయింది.
వరంగల్: తెలుగు రాష్ట్రాల్లో వాన (Rains) దంచి కొడుతోంది. గ్యాప్ ఇవ్వకుండా వర్షం పడుతూనే ఉంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులపైకి భారీగా వర్షపు నీరు చేరింది. కొన్నిచోట్ల బ్రిడ్జీలపైకి నీరు వచ్చింది. వరంగల్ జిల్లా తోపనపల్లిలో ఓ ఆర్టీసీ బస్సు వరదనీటిలో చిక్కుకొంది. ఆ బస్సు నిన్న రాత్రి (శనివారం) బ్రిడ్జీ మీద ఉండిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు బంధువులకు పోన్లు చేసి సమాచారం అందజేశారు. క్షణ క్షణ వరద ప్రవాహం పెరగడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
రాత్రంతా బస్సులోనే..
TS 24Z 0018 ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి మహబుబాబాద్ వెళుతోంది. నెక్కొండ మండలం వెంకటాపురం వద్ద చెరువు మత్తడి పొంగిపొర్లుతుంది. తోపనపల్లి చెరువు పొంగి ప్రవహించడంతో కట్టపై ఉన్న బస్సు వరద నీటిలో నిలిచిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికుల రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. వరదనీరు పెరగడంతో బస్సు ముందుకు గానీ, వెనక్కు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కట్టపై బస్సు మధ్యలో ఆగడం.. రాత్రంతా చీకటి ఉండటంతో ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడిపారు.
ట్రక్‌లు ధ్వంసం..
మరోవైపు మహబూబాబాద్ జిల్లాలో వర్షానికి రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి సమీపంలో పట్టాలపై కంకర కొట్టుకుపోయింది. దానిని చూసిన రైల్వే సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఆ రూట్‌లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. ఆ సమీపంలో విద్యుత్ స్తంభాలు పక్కకు ఒరిగిపోయి కనిపించాయి. మరోవైపు తాళ్లపూసలపల్లి వద్ద రైల్వేట్రాక్ వరదనీటితో నిండిపోయింది. పందిళ్లపల్లి వద్ద నుంచి 4 గంటలపాటు మహబూబ్ నగర్ విశాఖ ఎక్స్ ప్రెస్ ఆగింది.
24 రైళ్ల నిలిపివేత
విజయవాడ కాజీపేట మార్గంలో ట్రాక్ పైకి వరద నీరు చేరడంతో 24 రైళ్లను నిలిపివేశారు. సింహాద్రి, మచిలీపట్నం, గౌతమి, సంఘమిత్ర ఎక్స్ ప్రెస్, గంగా-కావేరి, చార్మినార్, యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ నిలిచిపోయాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రబాబు పథకాలు దేశానికే ఆదర్శం
Read Latest AP News and Telugu News
Updated Date - Sep 01 , 2024 | 12:04 PM