MLC Kavitha: కవితకు ఆ పుస్తకం ఎందుకు? ఆ పుస్తకాన్నే ఎందుకు అడిగారు?
ABN, Publish Date - Apr 02 , 2024 | 07:21 PM
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తనకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సీబీఐ ప్రత్యేక కోర్టుని కోరారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు (Delhi Liquor Scam) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో (Money Laundering Case) అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తనకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సీబీఐ ప్రత్యేక కోర్టుని (CBI Special Court) కోరారు. ఒంటిపై ఉన్న నగలను అనుమతించాలని.. ప్రత్యేకంగా బెడ్, బెడ్ షీట్లు, చెప్పులు, ట్యాబ్‌లెట్‌లు ఇవ్వాలని అడిగారు. కవిత ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకొని ఆ వసతులు కల్పించాలని జైలు అధికారుల్ని కోర్టు ఆదేశించింది. అయితే.. ఆ ఆదేశాల్ని అధికారులు పెడచెవిన పెట్టడంతో.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని పరిశీలించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.. ఆమెను రాజకీయ నిందితురాలిగా గుర్తించి ఆమెకు వసతులు కల్పిచాలని ఆదేశాలు జారీ చేసింది.
సీఎం జగన్ నా అనుకున్న వాళ్లందరినీ నాశనం చేశాడు.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
ఇదే సమయంలో.. తనకు ఖాళీ సమయంలో చదువుకునేందుకు కొన్ని పుస్తకాలు కూడా కావాలని కవిత కోరారు. ఆమె అడిగిన జాబితాలో ఓ పుస్తకం గురించి తెలిసి.. లాయర్లు, బీజేపీ నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకీ ఆమె అడిగిన పుస్తకమేంటో తెలుసా? బీజేపీ (BJP) సిద్ధాంతాలకు పునాది అయిన ఆర్ఎస్ఎస్ (RSS) రచించిన ‘‘21వ శతాబ్ధానికి ఆర్ఎస్ఎస్ రోడ్ మ్యాప్స్’ (Roadmaps for the 21st Century). ఈ పుస్తకం కావాలని కవిత అడగడంతో.. ఆమె ఆర్ఎస్ఎస్ భావజాలం పట్ల ఆకర్షితులయ్యారా? అనేది అందరూ చర్చించుకుంటున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ముద్రితమైన ఈ పుస్తకంలో.. స్వయంసేవక్‌లు ప్రభుత్వంలో ఉన్నత స్థానాలకు ఎదగడంతోపాటు సంఘ్ ప్రధాన ఆలోచనలైన హిందూ రాష్ట్ర ఏర్పాటు, ఏకాత్మత, సామాజిక, రాజకీయ అంశాలు వంటివి ఉన్నాయి. భారత్ పట్ల ఆర్ఎస్ఎస్ ఆలోచనలేంటి? భారత్ హిందూ రాష్ట్రంగా మారితే.. ముస్లిం, ఇతర మత విశ్వాసలకు చెందిన ప్రజల పరిస్థితి ఏంటి? కుల రాజకీయాలను హిందుత్వం అధిగమిస్తుందా? మారుతున్న కుటుంబ స్వభావం, విభిన్న లైంగిక ధోరణులు, వ్యక్తుల హక్కులకు సంబంధించిన సామాజిక సమస్యలపై ఆర్ఎస్ఎస్ అభిప్రాయం ఏమిటి? వంటి వివాదాస్పద అంశాలను ఆర్ఎస్ఎస్ నేత సునీల్ అంబేకర్ (Sunil Ambekar) ఈ పుస్తకంలో విశ్లేషించారు.
ఎన్నికల కోడ్‌ని ప్రధాని మోదీ ఉల్లంఘించారు.. బీజేపీ నుంచి ఆ డబ్బులు వసూలు చేయండి
ఈ పుస్తకంతో పాటు గజేంద్ర మోక్షం, నరసింహ శతకం, జయ ఘోష లాంటి తెలుగు పుస్తకాలు కూడా కావాలని కవిత అడిగారు. ది కుకింగ్ ఆఫ్ బుక్స్, 365 సుడుకోస్, మురకామి-నార్వేజియన్ వుడ్, ది డైరీ ఆఫ్ ఏ యంగ్ గర్ల్, లివింగ్ ఇన్ ది లైట్ అండ్ పేపర్ క్లబ్ నోట్‌బుక్ లాంటి పుస్తకాలను సైతం ఆమె డిమాండ్ చేశారు. వీటికితోడు జపం చేసుకునేందుకు ఒక జపమాల, లేసెస్ లేని షూస్, రోజూ వారీ వార్తాపత్రికలను కవితకు అందజేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు జైలు అధికారుల్ని ఆదేశించింది. ఇదంతా ఓకే గానీ.. ఆర్ఎస్ఎస్ రోడ్ మ్యాప్స్ పుస్తకాన్ని కవిత ఎందుకు చదవాలని అనుకుంటున్నారన్నదే ఇక్కడ హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 02 , 2024 | 07:23 PM