ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress: రేవంత్ బీజేపీలో చేరతారా.. సీఎం ఏమన్నారంటే

ABN, Publish Date - May 08 , 2024 | 11:19 AM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతో(Vemuri Radha Krishna) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం బిగ్ డిబేట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే.

హైదరాబాద్: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతో(Vemuri Radha Krishna) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంగళవారం బిగ్ డిబేట్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే.

ఎన్నికలయ్యాక రేవంత్ కొందరు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరతారని బీఆర్ఎస్ నేతలు పదే పదే అంటున్నారని.. నిజంగానే బీజేపీలో చేరబోతున్నారా అని రాధాకృష్ణ అడిగిన ప్రశ్నకు రేవంత్ స్పందించారు.


CM Revanth: రేవంత్ చేతులకు గోర్లతో రక్కిన గాయాలు.. అసలేమైంది..?


ఆయన మాట్లాడుతూ.. "నన్ను అనడానికి కేసీఆర్‌కు ఏమీ దొరకలేదు. వంద రోజుల్లో పాస్‌ మార్కులతో పని చేశానని సమాజం ఆమోదించింది. నిజానికి, పార్టీ బలంగా ఉన్నప్పుడు నన్ను రమ్మంటేనే నేను వెళ్లలేదు. నేను తెలుగుదేశాన్ని వదిలిన రోజుల్లో ఎన్డీయేలో టీడీపీ భాగస్వామి. నిజంగానే ఏదో ఒకటి కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు నన్ను అకామిడేట్‌ చేయగలిగేవాడు. అయినా నేను ఆశించలేదు. కాంగ్రెస్‌లో చేరా. కష్టపడ్డా.. పైకి వచ్చా.. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం తక్కువుందని బీజేపీ(BJP)లోకి వెళతాను? కేంద్ర హోం శాఖ నాపై ఫిర్యాదు చేసింది. ఢిల్లీ పోలీసులను పంపించి.. ముఖ్యమంత్రిని పిలిపించే స్థితికి వచ్చింది.

తెలంగాణ సార్వభౌమాధికారం మీదనే కేంద్రం దాడి చేస్తోంది. దీనిని కేసీఆర్‌ ఎందుకు ఖండించడం లేదు? ఇది రేవంత్‌ రెడ్డి సమస్య కాదు. నోటీసు ఇచ్చింది తెలంగాణ సీఎంకు. ఫిర్యాదుదారుడు ఢిల్లీలో హోం శాఖకు సంబంధించిన వారు.. ఇవాళ వంద, 200 మంది ఢిల్లీ పోలీసులు తెలంగాణలో అన్ని జిల్లాలకు పోయి వ్యవస్థల మీద రాత్రిపూట దాడి చేస్తున్నారు. నన్ను వస్తావా రావా అని కూర్చున్నారు. నేను కుదరదని చెప్పా" అని రేవంత్ వివరించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: బీజేపీ గెలిచే 400 స్థానాల్లో హైదరాబాద్‌ ఉండాలి

Read Latest Telangana News and National News

Read Latest National News and Telugu News

Updated Date - May 08 , 2024 | 11:20 AM

Advertising
Advertising