ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Arfa Khanum Sherwani: నేనూ మోదీ ప్రభుత్వ బాధితురాలినే..

ABN, Publish Date - Jul 29 , 2024 | 04:06 AM

ఓ ముస్లిం మహిళగా, పాత్రికేయురాలిగా తాను మోదీ సర్కారు బాధితురాలినేనంటూ ‘ది వైర్‌’ సీనియర్‌ ఎడిటర్‌ ఆర్ఫాఖానుమ్‌ షేర్వానీ వ్యాఖ్యానించారు. మోదీ ప్రధాని అయిన మొదట్నుంచి ప్రజా వ్యతిరేక విధానాలనే అవలంబించారని.. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టారని ఆరోపించారు.

  • ‘ది వైర్‌’ సీనియర్‌ ఎడిటర్‌ ఆర్ఫాఖానుమ్‌

హైదరాబాద్‌ సిటీ, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ఓ ముస్లిం మహిళగా, పాత్రికేయురాలిగా తాను మోదీ సర్కారు బాధితురాలినేనంటూ ‘ది వైర్‌’ సీనియర్‌ ఎడిటర్‌ ఆర్ఫాఖానుమ్‌ షేర్వానీ వ్యాఖ్యానించారు. మోదీ ప్రధాని అయిన మొదట్నుంచి ప్రజా వ్యతిరేక విధానాలనే అవలంబించారని.. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టారని ఆరోపించారు. జాతీయ మీడియా సైతం మోదీ అప్రజాస్వామిక విధానాలకు వంతపాడుతూ, అబద్ధాలను వండి వార్చిందని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ప్రొఫెసర్‌ జయశంకర్‌ 13వ స్మారక సభను తెలంగాణ విద్యావంతుల వేదిక నిర్వహించింది. ఈ సందర్భంగా ‘సమకాలీన భారతీయ సమాజం-భావి సవాళ్లు’ అంశంపై ఆర్ఫాఖానుమ్‌ కీలకోపన్యాసం చేశారు.


ప్రజాస్వామ్యంలో ప్రజలే శక్తిమంతులని.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని జయశంకర్‌ ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్లే అది మలిదశ పోరాటంగా రూపుదాల్చి స్వరాష్ట్రం సిద్ధించడం.. ప్రజా ఉద్యమాల స్ఫూర్తికి నిదర్శనమని కొనియాడారు. కార్యక్రమంలో టీజేఎస్‌ చీఫ్‌ కోదండరాం, విద్యావంతుల వేదిక ప్రతినిధులు అంబటి నాగయ్య, తిప్పర్తి యాదయ్య, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. రచయిత అరుంధతీ రాయ్‌తో పాటు పలువురు జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ సంతకాల సేకరణ చేపట్టారు.

Updated Date - Jul 29 , 2024 | 04:06 AM

Advertising
Advertising
<