Suryapet: చనిపోతున్నా.. పిల్లలను బాగా చూసుకో భర్తకు ఫోన్ చేసి.. వివాహిత ఆత్మహత్య
ABN, Publish Date - Nov 12 , 2024 | 04:07 AM
పని చేసే చోట సహోద్యోగి వేధింపులు, యాజమాన్యం దురుసు మాటలకు మనస్తాపంతో ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది.
ఆస్పత్రిలో సహోద్యోగుల వేధింపులు
దురుసు ప్రవర్తనతోమనస్తాపం
సూర్యాపేట క్రైం/సూర్యాపేట సిటీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పని చేసే చోట సహోద్యోగి వేధింపులు, యాజమాన్యం దురుసు మాటలకు మనస్తాపంతో ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటలోని చంద్రన్నకుంటలో ఉంటున్న కొత్తపల్లి కిరణ్మయి(32) జిల్లా కేంద్రం జమ్మిగడ్డలోని లయన్స్ కంటి ఆస్పత్రిలో నాలుగు నెలలుగా కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తోంది. అక్కడ టెక్నీషియన్ పవన్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై బాధితురాలు మేనేజర్‌కు ఫిర్యాదు చేసి నా.. వేధింపులు ఆగలేదు.
ఈక్రమంలో వేధింపుల నుంచి తనకు రక్షణ కల్పించాలని, వేతనం పెంచాలని పాలక వర్గ ప్రతినిధులను ఆమె కోరారు. వారు సైతం దురుసుగా ప్రవర్తించడంతో మనస్తాపం చెందిన కిరణ్మయి తన భర్త ప్రవీణ్‌కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలిపింది. తాను చనిపోతున్నానని, పిల్లలను బాగా చూసుకోవాలని చెప్పింది. ఇంటికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. వెంటనే ప్రవీణ్ వెళ్లి చూడగా.. కిరణ్మయి చనిపోయి ఉంది. దీంతో కిరణ్మయి బంధువులు... ఆమె మృతదేహాన్ని లయన్స్ కంటి ఆస్పత్రికి తీసుకువచ్చి ఆందోళన చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Updated Date - Nov 12 , 2024 | 04:07 AM