Success Story: నాలుగు కొలువులు సాధించిన పేద యువతి
ABN, Publish Date - Aug 06 , 2024 | 04:34 AM
ప్రతిభను ఏ ఆటంకం ఆపలేదని, కష్టపడి పడి చదివితే అనుకున్నది సాధించవచ్చని నిరూపించింది ఆ నిరుపేద యువతి.
కట్టంగూరు, ఆగస్టు 5: ప్రతిభను ఏ ఆటంకం ఆపలేదని, కష్టపడి పడి చదివితే అనుకున్నది సాధించవచ్చని నిరూపించింది ఆ నిరుపేద యువతి. నాలుగు ఉద్యోగాలకు ఎంపికై పేదరికం ప్రతిభకు అడ్డుకాదనడానికి ఉదాహరణగా నిలిచింది. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం కలిమెర చింతల వెంకన్న-లక్ష్మి దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.
కూలీ పనులు చేస్తూనే పిల్లలను పోషిస్తూ చదివించుకున్నారు. వారి చిన్న కూతురు తులసి.. ఇటీవల వెల్లడైన గ్రూప్- 4 ఫలితాల్లో అర్హత సాధించింది. అలాగే పాలిటెక్నిక్ అధ్యాపక ఉద్యోగంతో పాటు ఆగస్టులో ఏఈఈ ఉద్యోగానికి, ఏప్రిల్‌లో ఏఈ ఉద్యోగానికి ఎంపికైంది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన తులసి ప్రస్తుతం మెయిన్స్‌కు సిద్ధమవుతోంది. గ్రూప్-1 సాధించడమే తన లక్ష్యమని ఆమె చెబుతున్నారు.
Updated Date - Aug 06 , 2024 | 06:21 AM