ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nalgonda: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడు బలి..

ABN, Publish Date - Aug 20 , 2024 | 05:52 AM

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసం చేసిన అప్పుల ఊబి నుంచి బయటపడలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

  • సుమారు రూ.2కోట్ల అప్పులు చేసిన వైనం

  • సాగర్‌ ఎడమ కాల్వలో దూకి బలవన్మరణం

నల్లగొండ, పెన్‌పహాడ్‌, ఆగస్టు 19: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసం చేసిన అప్పుల ఊబి నుంచి బయటపడలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. నల్లగొండ పట్టణానికి చెందిన తడకమళ్ల సోమయ్య కిరాణ దుకాణం నిర్వహిస్తుండగా.. ఆయన కుమారులు సాయికుమార్‌(28), సంతోష్‌ వ్యాపారంలో సహకరించేవారు. అయితే ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ చేస్తూ సాయికుమార్‌ సుమారు రూ.2కోట్ల అప్పులు చేశాడు. అప్పులిచ్చినవారు కొద్దికాలంగా ఇంటి వద్దకు వచ్చి ఒత్తిడి చేస్తున్నారు.


ఈ క్రమంలో ఈ నెల 14న బయటకు వెళ్లిన సాయికుమార్‌ ఇంటికి తిరిగిరాకపోవటంతో సోదరుడు సంతోష్‌ 17న నల్లగొండలోని వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి హాలియా చెక్‌పోస్టు వద్ద ఉన్న 14వ మైలురాయి సమీపంలో సాయికుమార్‌ సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఉన్నట్టు తెలుసుకున్నారు. అయితే సాగర్‌ ఎడమకాల్వ వద్ద ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్‌ ఉంచి కాల్వలో దూకి బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. సోమవారం సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం దోసపహాడ్‌ గ్రామసమీపంలోని సాగర్‌ ఎడమకాల్వలో మృతదేహం తేలటంతో పెన్‌పహాడ్‌ పోలీసులు మృతుడి కుటుంబానికి సమాచారమిచ్చారు.

Updated Date - Aug 20 , 2024 | 06:03 AM

Advertising
Advertising
<