ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YouTuber Controversy: వ్యూస్‌ కోసం నెమలి కూర వండేశాడు?

ABN, Publish Date - Aug 12 , 2024 | 04:11 AM

వ్యూస్‌, లైక్‌లు, సబ్‌స్ర్కైబర్ల పిచ్చితో కొందరు యూట్యూబర్లు విచక్షణను మరిచి నచ్చిన కంటెంట్‌ను సోషల్‌ మీడియాలో పెట్టేస్తున్నారు.

  • రాజన్నసిరిసిల్ల జిల్లాలో యూట్యూబర్‌ అరెస్టు

  • కోడి కూర వండి తంబ్‌నైల్‌లో నెమలని పెట్టానంటున్న నిందితుడు

తంగళ్లపల్లి, ఆగస్టు 11: వ్యూస్‌, లైక్‌లు, సబ్‌స్ర్కైబర్ల పిచ్చితో కొందరు యూట్యూబర్లు విచక్షణను మరిచి నచ్చిన కంటెంట్‌ను సోషల్‌ మీడియాలో పెట్టేస్తున్నారు. ఇదే కోవలో మన జాతీయ పక్షి అయిన నెమలిని ఎలా కూర చేసుకోవాలో చూపిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన కోడం ప్రణయ్‌ కుమార్‌ అనే యూట్యూబర్‌ వీడియో విడుదల చేశాడు. అనుకున్నట్టుగానే ఆ వీడియో వైరలయ్యింది కానీ సదరు యూట్యూబర్‌ మాత్రం కటకటాల పాలయ్యాడు. ప్రణయ్‌ కుమార్‌ శ్రీటీవీ పేరుతో ఓ యూట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తున్నాడు. వంటలకు సంబంధించిన వీడియోలను ఈ చానల్‌లో పెడుతుంటాడు.


ఇదే క్రమంలో తంబనైల్‌లో నెమలి బొమ్మ పెట్టి ‘ట్రెడిషనల్‌ పికాక్‌ కర్రీ రెసిపీ’ పేరిట శనివారం ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. నెమలి మాంసంతో కూర ఎలా వండుకావాలో ఆ వీడియోలో చూపించాడు. పోస్ట్‌ చేసిన కొద్ది గంటల తర్వాత వీడియోను యూట్యూబ్‌ నుంచి తొలగించాడు. ఈ లోపే వీడియో బాగా వైరలయ్యింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు ప్రణయ్‌కుమార్‌ను ఆదుపులోకి తీసుకుని నెమలి కూర వండిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రణయ్‌ వండిన కూరను స్వాధీనం చేసుకుని ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్‌ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. అయితే, తాను వండింది నెమలిని కాదని కోడి కూర చేసి వ్యూస్‌ కోసం నెమలి కూర అని తంబ్‌నైల్‌ పెట్టానని ఆ యూట్యూబర్‌ చెబుతుండడం కొసమెరుపు.

Updated Date - Aug 12 , 2024 | 04:11 AM

Advertising
Advertising
<