ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YS Jagan: ఖైదీ నెంబర్ 6093 @ 12 ఏళ్లు

ABN, Publish Date - May 27 , 2024 | 01:02 PM

వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్.. అక్రమాస్తుల కేసులో అరెస్టయి నేటికి అంటే... మే 27వ తేదీకి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2012 మే 27వ తేదీన నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో దిల్ కుషా గెస్ట్ హౌస్‌లో వైయస్ జగన్‌‌ని సీబీఐ అరెస్ట్ చేసింది

వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైయస్ జగన్.. అక్రమాస్తుల కేసులో అరెస్టయి నేటికి అంటే... మే 27వ తేదీకి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2012 మే 27వ తేదీన నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో దిల్ కుషా గెస్ట్ హౌస్‌లో వైయస్ జగన్‌‌ని సీబీఐ అరెస్ట్ చేసింది. తన తండ్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారన్నతీవ్రమైన అభియోగాల నేపథ్యంలో వైయస్ జగన్‌ను సీబీఐ సుదీర్ఘంగా విచారించింది.


ఆ క్రమంలో మైనింగ్ లీజులు, ప్రాజెక్టుల కేటాయింపుల రూపంలో అనుమతులు లభించాయనే ఆరోపణల నేపథ్యంలో వైయస్ జగన్‌పై సీబీఐ ప్రశ్నలు సంధించింది. ఆ క్రమంలో వైయస్ జగన్‌ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన దాదాపు 58 కంపెనీలకు సైతం ఈడీ, సీబీఐలు సమన్లు జారీ చేశాయి. అయితే వాటిపై విచారణ కొనసాగుతుండగా వైయస్ జగన్‌ తన జ్యుడీషియల్ కస్టడీని పదే పదే పొడిగించారు.


అలా వైయస్ జగన్ పదహారు నెలలు జైలు జీవితం అనుభవించారు. అనంతరం 2013, సెప్టెంబరు 23వ తేదీన బెయిల్‌‌పై ఆయన విడుదలయ్యారు. నాటి నుంచి వైయస్ జగన్‌ బెయిల్‌పై బయట దర్జాగా తిరుగుతున్నారు. అంతేకాదు.. విచారణకు కూడా హాజరు కాకుండా పదే పదే మినహాయింపులు కోరుతూ వస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ఐదేళ్లుగా వైయస్ జగన్ విచారణకు గైర్హాజరవుతునే ఉన్నారు. ఈ అంశంపై ప్రజలు, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా.. వైయస్ జగన్ రెడ్డి తీరు మాత్రం ఐ డోంట్ కేర్ అన్నట్లుగా ఉండడం గమనార్హం.

Read Latest National News and Telugu News

Updated Date - May 28 , 2024 | 08:49 PM

Advertising
Advertising