వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఫస్ట్ రియాక్షన్
ABN, Publish Date - Oct 23 , 2024 | 08:46 PM
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. అనంతరం ఆమె వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఆరోపణలు గుప్పించారు. జగన్ మోహన్ రెడ్డికి మహిళల మీద గౌరవం లేదన్నారు. మహిళల అభ్యున్నతికి ఆయన ఎప్పుడు పాటు పడలేదని చెప్పారు. ఆయన ప్రభుత్వ హయాంలో మహిళలపై జరిగిన దాడులపై స్పందించలేదని గుర్తు చేశారు. ఆయనే కాదు.. అప్పటి హోం శాఖ మంత్రి సైతం స్పందించలేదంటూ వాసిరెడ్డి పద్మ తీవ్రంగా వైఎస్ జగన్ పాలనను విమర్శించారు.

ఇక గత జగన్ ప్రభుత్వ హయాంలో మహిళా కమిషన్ చైర్మన్‌గా వాసిరెడ్డి పద్మ విధులు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్ వైసీపీ స్థాపించిన అనంతరం ఆ పార్టీలో ఆమె చేరారు. నాటి నుంచి నిన్న మొన్నటి వరకు ఆమె ఆ పార్టీలోనే కొనసాగారు. అయితే వాసిరెడ్డి పద్మ వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం వైఎస్ జగన్‌పై కీలక ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత విలేకర్ల సమావేశంలో పద్మ చేసిన వ్యాఖ్యలపై స్పందించడమే కాకుండా.. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ఘాటుగా చురకలు సైతం అంటించారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Oct 23 , 2024 | 08:47 PM