ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: లంగా గాడు.. ఈ నా కొడుకు ఆ స్థాయి ఉందా

ABN, Publish Date - Sep 12 , 2024 | 01:42 PM

ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. అందులోభాగంగా గురువారం కొండాపూర్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ తన అనుచరులతో కలిసి వెళ్లారు.

ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. అందులోభాగంగా గురువారం కొండాపూర్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ తన అనుచరులతో కలిసి వెళ్లారు. గాంధీ ఇంటికి వెళ్లి.. బీఆర్ఎస్ కండవా కప్పుతానంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అతడి ఇంటికి అరికెపూడి గాంధీ వెళ్లారు. దీంతో కౌశిక్ రెడ్డి నివాస ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. దాంతో ఆ ప్రాంతంలో పోలీసులు సైతం భారీగా మోహరించారు.


ఆరికేపూడి గాంధీ అనుచరులు.. కౌశిక్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి కిటికి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. తనను గెలిపించకుంటే తమ కుటుంబానికి ఆత్మహత్యే శరణ్యమంటూ ప్రజలను ఇదే కౌశిక్ రెడ్డి వేడుకున్నారని గుర్తు చేశారు. అలా ఎమ్మెల్యేగా గెలిచి ఈ రోజు అతడు ఇలా తనపై వ్యాఖ్యలు చేయడం పట్ల ఆరికేపూడి గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.


అనంతరం కౌశిక్ రెడ్డి నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆరికేపూడి గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆరికేపూడి గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో చేరిన నాటి నుంచి కౌశిక్ రెడ్డి వ్యవహారం ఏ మాత్రం బాగోలేదన్నారు. అతడి వల్లే పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైందని తెలిపారు. ఇటీవల పీఏసీ చైర్మన్‌గా ఆరికేపూడి గాంధీ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనపై బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు గుప్పించారు. అందులోభాగంగా ఎమ్మెల్యే ఆరికేపూడి గాంధీ‌పై కౌశిక్ రెడ్డి విమర్శలు సంధించారు.

Updated Date - Sep 12 , 2024 | 01:42 PM

Advertising
Advertising