ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మందుబాబులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

ABN, Publish Date - Aug 12 , 2024 | 02:20 PM

మందుబాబులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త మద్యం బ్రాండ్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. అందులోభాగంగా కొత్త మద్యం పాలసీ.. ప్రొక్యూరిమెంట్‌ పాలసీపై ఎక్సైజ్ శాఖ కసరత్తు జరుపుతుంది. ఆ క్రమంలో మద్యం కొనుగోళ్ల పాలసీపై మద్యం కంపెనీలతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు.

మందుబాబులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త మద్యం బ్రాండ్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. అందులోభాగంగా కొత్త మద్యం పాలసీ.. ప్రొక్యూరిమెంట్‌ పాలసీపై ఎక్సైజ్ శాఖ కసరత్తు జరుపుతుంది. ఆ క్రమంలో మద్యం కొనుగోళ్ల పాలసీపై మద్యం కంపెనీలతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ మాసం చివర లేకుంటే వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్రంలో అన్ని రకాల బ్రాండ్ల విక్రయాలకు అనుమతి ఇవ్వనున్నారు.


గత జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన జే బ్రాండ్ మద్యాన్ని రాష్ట్రంలో పూర్తిగా నిర్మూలించేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు.. ఉత్తరప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ ఉన్నతాధికారులు పర్యటించారు. ఆ యా రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలతోపాటు అమలు చేస్తున్న విధి విధానాలను ఉన్నతాధికారులు పరిశీలించారు. అలాగే మద్యం తయారీ, విక్రయాల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను సైతం వారు పూర్తిగా అధ్యయనం చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన నివేదికను మరికొద్ది రోజుల్లో ప్రభుత్వానికి అధికారులు అందజేయనున్నారని తెలుస్తుంది.


మరోవైపు నాసిరకం మద్యం మార్కెట్‌లో ఉండడానికి వీల్లేదని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే పేదలు, నిరుపేదలు వాడే మద్యం క్వార్టర్ ధర రూ.100 లోపు ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా ఎక్సైజ్ అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో జే బ్రాండ్ మద్యం తీసుకు వచ్చింది. ఈ మద్యం నాసిరకంగా ఉండడమే కాకుండా.. మినిమం క్వార్టర్ మద్యం సీసా ధర రూ. 200లుగా నిర్ణయించారు. దీంతో 2019 నుంచి నిన్న మొన్నటి వరకు ఈ మద్యం తాగి అనారోగ్యం బారిన పడి మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో లక్షల సంఖ్యలో ఉందన్న సంగతి అందరికి తెలిసిందే.

Updated Date - Aug 12 , 2024 | 02:20 PM

Advertising
Advertising