మమతా మాకొద్దంటూ రోడ్డెక్కిన బెంగాళీలు..!
ABN, Publish Date - Aug 21 , 2024 | 09:55 PM
కోల్‌కతా ఆర్జీ కర్(RG Kar) ఆస్పత్రిలో మహిళా మెడికో హత్యోదంతం మమతా బెనర్జీ(Mamata Banerjee) ప్రభుత్వంలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. మమతా ఇమేజ్ బాగా దెబ్బతింది.
పశ్చిమ బెంగాల్: కోల్‌కతా ఆర్జీ కర్(RG Kar) ఆస్పత్రిలో మహిళా మెడికో హత్యోదంతం మమతా బెనర్జీ(Mamata Banerjee) ప్రభుత్వంలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. మమతా ఇమేజ్ బాగా దెబ్బతింది. 2011లో మమతా బెనర్జీ సీఎం అయినప్పటి నుంచీ ఇప్పటివరకూ ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదామె. బెంగాల్‌లో మెజార్టీ మధ్య తరగతి ప్రజల విశ్వాసాన్ని ఆమె కోల్పోయారని సమాచారం. మెడికోలు సైతం తమకు సీఐఎస్ఎఫ్, సీఆర్ఫీఎస్ భద్రతా కావాలని కోరుతున్నారు, కానీ రాష్ట్ర పోలీసులను మాత్రం విశ్వసించడం లేదు. వైద్య ఆరోగ్య శాఖను ప్రస్తుతం ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే పర్యవేక్షిస్తున్నారు. శాంతి భద్రతల శాఖ కూడా తన దగ్గరే పెట్టుకున్నారు. ఈ రెండు శాఖల వైఫల్యంలో ముఖ్యపాత్ర మమతా బెనర్జీనే అని బెంగాళీలు నిందిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ నిధులు వైఎస్ జగన్ ఏం చేశారు..?
నా ఉద్యోగం నాకివ్వండి: ప్రవీణ్ ప్రకాష్
కోల్‌కతా కేసుపై సుప్రీం కోర్టు సీరియస్..
సీఐడీ విచారణకు జోగి రమేష్ డుమ్మా ..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Aug 21 , 2024 | 10:00 PM