వైఎస్ భారతి కొత్త ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?
ABN, Publish Date - Aug 18 , 2024 | 06:15 PM
వైయస్ఆర్ సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లి నుంచి బెంగళూరుకు షటిల్ సర్వీస్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు పక్కన పెట్టారు. దీంతో అధికారం దూరమైన జస్ట్ 60 రోజుల్లో వైయస్ జగన్ దాదాపు 6 సార్లు... తాడేపల్లి నుంచి బెంగళూరుకు ప్రయాణం కట్టారని సమాచారం.
వైయస్ఆర్ సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లి నుంచి బెంగళూరుకు షటిల్ సర్వీస్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు పక్కన పెట్టారు. దీంతో అధికారం దూరమైన జస్ట్ 60 రోజుల్లో వైయస్ జగన్ దాదాపు 6 సార్లు... తాడేపల్లి నుంచి బెంగళూరుకు ప్రయాణం కట్టారని సమాచారం. దీంతో వైయస్ జగన్ బెంగళూరు ప్రయాణంపై రాజకీయ వర్గాల్లో ఓ చర్చ సైతం కొనసాగుతుంది.
ఇలా మాజీ సీఎం వైయస్ జగన్ బెంగళూరుకు ప్రయాణం కట్టిన ప్రతీ సారి.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయంలోని ఫైళ్లు దహనమవుతున్నాయి. అలాగే అల్లర్లు సైతం జరుగుతున్నాయనే ఓ చర్చ సైతం రాష్ట్రంలో ఊపందుకుంది.
ఇక వైసీపీ అధికారంలోనున్న సమయంలో నాటి ప్రభుత్వంతో అంటకాగిన ప్రభుత్వాధికారులను సైతం బెంగళూరుకు పిలిపించుకుని వైయస్ జగన్ మాట్లాడుతున్నారనే ప్రచారం కూడా వాడి వేడిగా సాగుతుంది. ఆ తర్వాతే.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలా దస్త్రాల దహన ప్రక్రియ ఊపందుకొంటుందనే ఓ చర్చ సైతం వైరల్ అవుతుంది.
Updated Date - Aug 18 , 2024 | 06:16 PM