ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Year-Ender 2024: ఈ ఏడాది సోషల్ మీడియాలో వైరల్ అయిన 5 అతి పెద్ద క్షణాలివే..

ABN, Publish Date - Dec 21 , 2024 | 01:55 PM

సోషల్ మీడియాలో ఈ ఏడాది ఎన్నో సంఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే వాటిలో కొన్ని ఘటనలు వీడియోల రూపంలో నెటిజన్లను తెగ ఆకట్టుకున్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన అలాంటి 5 వీడియోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మరికొద్ది రోజుల్లో 2024 ఏడాదికి వీడ్కోలు పలికి.. 2025వ సంవత్సరాననికి పలకబోతున్నాం. ఈ ఏడాదిలో చోటు చేసుకున్న అనేక ఘటనలు ఇకపై జ్ఞాపకాలుగా మిగిలిపోనున్నాయి. వాటిలో కొన్ని సంఘటనలు కొందరికి మాత్రమే తెలిస్తే.. మరికొన్ని సంఘటనలు దేశ ప్రజలందరినీ ప్రభావితం చేశాయి. ఇంకొన్ని సంఘటనలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఈ ఏడాది మొత్తంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన 5 అతి పెద్ద సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


సోషల్ మీడియాలో ఈ ఏడాది ఎన్నో సంఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే వాటిలో కొన్ని ఘటనలు వీడియోల రూపంలో నెటిజన్లను తెగ ఆకట్టుకున్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన అలాంటి 5 వీడియోల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటి సంఘటన విషయానికొస్తే..


1. ఇటలీ ప్రధానితో ప్రధాని మోదీ సెల్ఫీ..

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో భారత ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) సెల్ఫీ దిగిన ఫొటో నెట్టింట తెగ వైరల్ అయింది. జూన్‌లో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఇటలీ ప్రధానితో సెల్ఫీ దిగారు. ఈ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో చాలా మంది ఈ ఫోటోను రీషేర్‌లు చేసేశారు. దీంతో ఈ ఏడాది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సంఘటనల్లో ఈ చిత్రం మొదటి వరుసలో నిలిచిందన్నమాట.


2. ట్రంప్‌పై హత్యాయత్నం..

యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. ఈ ఏడాది జూలైలో హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని అగంతకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో బుల్లెట్ ట్రంప్ చెంపను తాకుతూ వెళ్లింది. ముఖంపై రక్తగాయాలను తుడుచుకుంటూ ధైర్యంగా ప్రసంగం చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.


3. ఒలింపిక్స్‌లో టర్కిష్ షూటర్ ప్రదర్శన

ఈ ఏడాది పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో టర్కీ షూటర్ యూసుఫ్ డికెక్ పాల్గొన్నారు. మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో డికెక్ స్టైల్‌గా నిలబడి.. ఒక చేతిని ఫ్యాంట్ జేబులో పెట్టుకుని, మరో చేత్తో సింపుల్‌గా గన్‌ పట్టుకుని షూట్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఈ పోటీలో ఆయన రజతం సాధించిన అందరనీ ఆశ్చర్యపరిచాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అయ్యాయి.


4. ప్రపంచంలోనే అత్యంత పొట్టి, పొడవు మహిళలు..

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహిళ అయిన రుమేసా గెల్లి.. ఓ సందర్భంలో ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ అయిన జ్యోతి అమ్గేను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. ఇది చాలా అరుదైన సందర్భం కావడంతో ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.


5. థాయిలాండ్ హిప్పో

థాయ్‌లాండ్‌కు చెందిన మూ డెంగ్ అనే అందమైన హిప్పో వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. బకెట్లో ఉన్న ఈ బుజ్జి హిప్పో ముఖ కవలికలు, పర్యాటకుల పట్ల ప్రవర్తించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో నెటిజన్లు ఈ వీడియోను రీ షేర్లు చేసేశారు. ఈ కారణంగా ఈ బుజ్జి హిప్పో వీడియో కూడా అరుదైన సంఘనల జాబితాలోకి వెళ్లిపోయిందన్నమాట.


మరిన్ని ఇయర్ -ఎండర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం ఈ లింక్‌‌‌పై క్లిక్ చేయండి..

Updated Date - Dec 21 , 2024 | 01:59 PM