Year-Ender 2024: ఈ ఏడాదిలో గూగుల్‌లో ఎక్కువగా ఎవరికోసం వెతికారంటే..
ABN, Publish Date - Dec 24 , 2024 | 09:56 PM
Year-Ender 2024: మరికొన్ని రోజుల్లో 2024 క్యాలెండర్ ముగియబోతోంది. 2025కి సంబంధించిన కొత్త క్యాలెండర్ మన ఇంట్లోకి రాబోతోంది. ఈ సందర్భంగా ఈ ఏడాదిలో చోటు చేసుకున్న అనేక అంశాల గురించి నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేయడం సర్వసాధారణం. అయితే..
మరికొన్ని రోజుల్లో 2024 క్యాలెండర్ ముగియబోతోంది. 2025కి సంబంధించిన కొత్త క్యాలెండర్ మన ఇంట్లోకి రాబోతోంది. ఈ సందర్భంగా ఈ ఏడాదిలో చోటు చేసుకున్న అనేక అంశాల గురించి నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేయడం సర్వసాధారణం. అయితే ఎక్కువ మంది నెటిజన్లు ఆ ఏడాదిలో సెర్చ్ చేసిన వ్యక్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2024లో సోషల్ మీడియాలో ఎక్కవమంది సెర్చ్ చేసిన అంశాల జాబితాను గూగుల్ విడుదల చేసింది. ఆ వివారల్లోకి వెళితే..
Google ఇయన్ ఇన్ సెర్చ్ నివేదిక ప్రకారం గత ఏడాది కంటే ఈ ఏడాది నెటిజన్లు విభిన్నమైన అంశాల గురించి సెర్చ్ చేసినట్లు తెలిసింది. US ఎన్నికలు మొదలకొని అనేక హిట్ సినిమాలకు సంబంధించిన వివరాలతో పాటూ వైరల్, ట్రెండింగ్ అంశాలపై వెతికినట్లు గూగుల్ పేర్కొంది. అయితే ఎక్కవ శాతం మంది గూగుల్‌లో వెతికిన వ్యక్తలు గురించి తెలుసుకుందాం..
2024 ఏడాదిలో (Year-Ender 2024) ఇప్పటివరకూ గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వ్యక్తుల్లో హర్యానాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, భారత మాజీ రెజ్లర్ వినేష్ పోగాట్ మొదటి స్థానంలో నిలిచారు. అధిక బరువు కారణంగా ఒలింపిక్స్‌లో మెడల్ చేజార్చుకున్న వినేష్ ఫోగాట్.. ఆ తర్వాత రెజ్లంగ్‌ను వదిలేసి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి అధిక మెజారిటీతో గెలిచారు. ఈ ఏడాదిలో ఈమెకు సంబంధించిన వివరాల గురించి ఎక్కువ మంది వెతికినట్లు తెలిసింది.
బీహార్ సీఎం నితీష్ కుమార్.. పరిచయం అక్కర్లేని పేరు. దేశంలో ఎక్కవ సార్లు సీఎం అయిన వారిలో నితీశ్ మొదటి స్థానంలో ఉన్నారు. అలాగే ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన వ్యక్తుల్లో నితీశ్ రెండో స్థానంలో నిలిచారు.
ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికులు సెర్చ్ చేసిన జాబితో మూడో స్థానంలో లోక్ జనశక్తి పార్టీ (రాం విలాస్) చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ నిలిచారు. ఈయన దివంగత పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడనే విషయం తెలిసిందే.
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టీ-20 వరల్డ్ కప్‌ను భారత్ కౌవసం చేసుకోవడంలో కీలకపాత్ర వహించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. మరోవైపు భార్యతో విడాకుల వ్యవహారంతో వార్తల్లో నిలిచాడు. దీంతో ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కవ మంది సెర్చ్ చేసిన జాబిలో పాండ్యా నాలుగో స్థానంలో నిలిచాడు.
ఇక ఐదో స్థానంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిలిచారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని రికార్డ్ సృష్టించడంతో పాటూ నెటిజన్ల దృష్టినీ ఆకర్షించారు.
ఆరో స్థానంలో క్రికెటర్ శశాంక్ సింగ్ ఉన్నారు. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య పంజాయ్ కింగ్స్ జట్టులోకి ప్రవేశించిన శశాంక్.. తన అద్భుమైన ఆటతీరుతో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకొన్నాడు. దీంతో ఈ ఏడాదిలో నెటిజన్లు సెర్చ్ చేసిన అత్యధికుల్లో శశాంక్ ఒకరుగా నిలిచారు.
మోడల్, నటి అయిన పూనం పాండే ఏడో స్థానంలో నిలిచారు. బోల్డ్ ఫొటోషూట్స్ చేస్తూ వార్తల్లో నిలిచిన పూనం.. గర్భాశయ క్యాన్సర్‌తో కన్ను మూసిందని వార్తలు వచ్చాయి. దీంతో చాలా మంది ఆ వార్తలు నిజమని నమ్మి గూగుల్‌లో సెర్చ్ చేయడం మొదలెట్టారు. అయితే అంతలోనే.. తాను బతికే ఉన్నానంటూ అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. కేన్సర్ మీద అవగాహన కల్పించడం కోసం ఈ డ్రామా ఆడినట్లు చెప్పింది. ఇలా ఈ ఏడాది అత్యధికులు సెర్చ్ చేసిన జాబితాలో ఈమె కూడా చేరిపోయింది.
ఇక 8వ స్థానంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కోడలు రాధిక మర్చంట్ నిలిచారు. ముఖేష్ చిన్న కుమారుడు అనంత్ అంబానీతో రాధిక వివాహం ఈ ఏడాది జూలైలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహానికి ప్రపంచం నలుమూలల నుంచి అతిరథ మహారధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాధిక మర్చంట్ నేపథ్యం తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ సెర్చ్ చేసినట్లు తెలిసింది.
మరోవైపు 9వ స్థానంలో టీమిండియా క్రికెటర్ అభిషేక్ శర్మ నిలిచారు. జింబాబ్వే టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అభిషేక్.. బౌలింగ్‌లో తన మార్క్ చూపించి క్రికెట్ అభిమానుల మనసు దోచుకున్నాడు.
ఈ ఏడాది గూగుల్‌లో సెర్చ్ చేసిన వ్యక్తుల్లో 10వ స్థానంలో బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్య సేన్ నిలిచారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారులలో లక్ష్య సేన్ ఒకరుగా నిలిచిన విషయం తెలిసిందే.
మరిన్ని ఇయర్ -ఎండర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..
Updated Date - Dec 24 , 2024 | 09:56 PM