Share News

Vishakhapatnam: 15 ఏళ్లకే.. 175 సర్టిఫికెట్‌ కోర్సులు

ABN , Publish Date - Mar 05 , 2025 | 04:58 AM

దివేది పదో తరగతి.. అయితేనేం 15 ఏళ్ల వయసులోనే 175 సర్టిఫికెట్‌ కోర్సులు చేసి ఔరా అనిపించింది.

Vishakhapatnam: 15 ఏళ్లకే.. 175 సర్టిఫికెట్‌ కోర్సులు

  • పదో తరగతి విద్యార్థిని ప్రవల్లిక ఘనత

  • ప్రత్యేక ఇంటర్వ్యూ చేసిన డిస్నీ హాట్‌ స్టార్‌

భీమునిపట్నం, మార్చి 4(ఆంధ్రజ్యోతి): చదివేది పదో తరగతి.. అయితేనేం 15 ఏళ్ల వయసులోనే 175 సర్టిఫికెట్‌ కోర్సులు చేసి ఔరా అనిపించింది. అందుకే ప్రముఖ టెలివిజన్‌ డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ ఆ విద్యార్థినిని వెతుక్కుంటూ వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంది. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలోని గొల్లలపాలెం కస్తూర్బా గాంధీ విద్యాలయంలో పదో తరగతి చదువుతున్న బండారు ప్రవల్లికను.. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిందని ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ గంగాకుమారి మంగళవారం తెలిపారు. ఇన్ఫోసిస్‌ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన స్ర్పింగ్‌ బోర్డులో ప్రవల్లిక టైమ్‌ మేనేజ్‌మెంట్‌, ఎలకా్ట్రనిక్స్‌, హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, డ్రోన్‌, రోబోటిక్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా బేసిస్‌ వంటి అనేక అంశాలపై 175 సర్టిఫికెట్‌ కోర్సులు చేసిందని చెప్పారు. చిన్న వయసులోనే ఇన్ని సర్టిఫికెట్‌ కోర్సులు చేసిన ఆమెను ఢిల్లీ నుంచి వచ్చిన హాట్‌స్టార్‌ టీమ్‌ కలిసిందని, ఆమె అనుభవాలను అడిగి తెలుసుకుందని పేర్కొన్నారు. ఈ ఇంటర్వ్యూ త్వరలోనే డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతుందని తెలిపారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కోనెంపాలేనికి చెందిన ప్రవల్లిక తల్లి పాప బ్రాండిక్స్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. తండ్రి కొవిడ్‌ సమయంలో చనిపోయారు.

Updated Date - Mar 05 , 2025 | 04:59 AM