ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt : జల వనరుల శాఖ ఇంజనీర్లకు పదోన్నతులు

ABN, Publish Date - Jan 12 , 2025 | 06:11 AM

రాష్ట్ర జల వనరుల శాఖలో 43 మంది ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లకు సూపరింటెండింగ్‌ ఇంజనీర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది.

  • ఎస్‌ఈలుగా.. 43 మంది ఈఈలు

అమరావతి, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జల వనరుల శాఖలో 43 మంది ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లకు సూపరింటెండింగ్‌ ఇంజనీర్లుగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2918లో చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన ప్రమోషన్లు తప్ప, గత ఐదేళ్లూ ఎలాం టి పదోన్నతులూ కల్పించలేదు. వైసీపీ ప్రభుత్వం సీనియారిటీ జాబితాను తయారు చేయలేదు. కానీ, వైసీపీకి సానుకూలంగా ఉన్న అధికారులకు అదనపు బాధ్యతల పేరిట 2 నుంచి మూడేసి చోట్ల కొలువులు అప్పగించారు. అదికూడా ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న ఒక్క సామాజికవర్గానికే పెద్దపీట వేస్తూ వచ్చారు. బహిరంగ సభల్లో నా ఎస్సీ, ఎస్టీ అని జగన్‌ చెబుతూ వచ్చారు. కానీ, ఎస్సీఎస్టీ ఇంజనీరింగ్‌ అధికారులకు పదోన్నతులు గానీ, అదనపు బాధ్యతలు గానీ ఇవ్వకుండా మూలన కూర్చోబెట్టారు. ఇటీవల జల వనరుల శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌లను కలసి తమకు పదోన్నతులు కల్పించాలని విజ్ఞ ప్తి చేశారు. అయితే, తాము పదోన్నతులు ఇస్తుంటే కొంద రు న్యాయస్థానాలను ఆశ్రయించడం వల్ల సాహసించలేకపోతున్నామని వారు చెప్పారు. దీంతో తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించబోమంటూ ఇంజనీరింగ్‌ అధికారులు హామీ ఇవ్వడంతో 43 మంది ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లను సూపరింటెండింగ్‌ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పిస్తూ శనివారంనాడు సాయిప్రసాద్‌ ఉత్తర్వు జారీ చేశారు.

Updated Date - Jan 12 , 2025 | 06:11 AM