Share News

marijuana 1.82 కిలోల గంజాయి పట్టివేత

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:23 AM

తనకల్లు మండలం గోవిందువారిపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద గంజాయితో ఉన్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

marijuana 1.82 కిలోల గంజాయి పట్టివేత
అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ

కదిరి, ఏప్రిల్‌14(ఆంధ్రజ్యోతి): తనకల్లు మండలం గోవిందువారిపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద గంజాయితో ఉన్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1.82 కిలోల గంజాయి, 4 సెల్‌ఫోన్లు, రూ.1100 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శివనారాయణస్వామి తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను కదిరి రూరల్‌ పోలీసు స్టేషనలో డీఎస్పీ వెల్లడించారు. అరెస్టయిన వారిలో ఒడిశాలోని బాలంగిర్‌ జిల్లా మహాగ్రామానికి చెందిన తులసి ఫరథుని, అన్నమయ్య జిల్లా ముదివేడు మండలం సాగుటోళ్లపల్లికి చెందిన పిక్‌ రెడ్డి బాషాకండీ, అదే జిల్లా ములకలచెరువు మండలం ఆవులవారిపల్లికి చెందిన నరసింహులు, తనకల్లు మండలం బాలసముద్రం గ్రామానికి చెందిన సురేందర్‌ ఉన్నారు. తులసి ఫరథుని ఒడిశా నుంచి గంజాయి తీసుకురాగా.. మిగతా ముగ్గురితో కలిసి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా.. ఎస్‌ఐ గోపి, కానిస్టేబుల్‌ నాగరాజు, వెంకటేష్‌, నారాయణస్వామి, పి. వెంకటే్‌ష దాడి చేసి పట్టుకున్నారు. నిందితుల నుంచి 7 ప్యాకెట్లలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ వివరించారు.

Updated Date - Apr 15 , 2025 | 12:23 AM