FARMERS : లో ఓల్టేజీతో రైతులకు కష్టాలు

ABN, Publish Date - Feb 10 , 2025 | 12:09 AM

రైతులకు నాణ్యమైన విద్యుత అందిస్తాం అం టూ ప్రకటనలకే పరిమితం తప్ప అచరణలో లేదు. ఆత్మకూ రు సబ్‌స్టేషన పనితీరే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మండలంలో ఆత్మకూరు, వడ్డుపల్లి, సనపలలో మూడు సబ్‌స్టేషన్లు ఉన్నాయి. వడ్డుపల్లి, సనప సబ్‌స్టేషన్ల ద్వారా వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత సరఫరా చేస్తున్నారు.

FARMERS : లో ఓల్టేజీతో రైతులకు కష్టాలు
Atmakur Substation

వ్యవసాయానికి ఏడు గంటలే ఇస్తున్నారని ఆవేదన

సబ్‌స్టేషన సామర్థ్యం తక్కువ : అధికారులు

ఆత్మకూరు, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి) : రైతులకు నాణ్యమైన విద్యుత అందిస్తాం అం టూ ప్రకటనలకే పరిమితం తప్ప అచరణలో లేదు. ఆత్మకూ రు సబ్‌స్టేషన పనితీరే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మండలంలో ఆత్మకూరు, వడ్డుపల్లి, సనపలలో మూడు సబ్‌స్టేషన్లు ఉన్నాయి. వడ్డుపల్లి, సనప సబ్‌స్టేషన్ల ద్వారా వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత సరఫరా చేస్తున్నారు. అయితే ఆత్మకూరు సబ్‌స్టేషన పరిధిలో మా త్రం ఏడుగంటలు మాత్రమే విద్యుత సరఫరా చేస్తున్నట్లు రైతులు వా పోతున్నారు. ఆత్మకూరు సబ్‌స్టేషనకు 88ఎంవీఏ కెపాసిటి మాత్రమే ఉంది. కేవలం రెండు ఫీడర్ల ద్వారా ఇంటి అవసరాలకు, వ్యవసాయానికి విద్యుత సరఫరా చేస్తారు. దీంతో ఎప్పుడూ లోఓల్టేజీ సమస్య నెలకొని, రైతుల కష్టాలు వర్ణణాతీతంగా మారాయి. ఎన్నోసార్లు పాలకులకు, అధికారులుకు వినతి పత్రాలు అందించి అలసిపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఈ సబ్‌స్టేషన సామర్థ్యాన్ని పెంచితే తప్ప వ్యవసాయానికి అను కూలంగా విద్యుత సరఫరా చేయవచ్చని అంటున్నారు. అయితే ఇప్పుడున్న స్థలం తగినంత లేకపోవడం వల్ల సబ్‌స్టేషన సామర్థ్యం పెంచేందుకు సాధ్యం కావడం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు విద్యుత సరఫరా చేయాలని స్థానిక రైతులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ఈ సబ్‌స్టేషన పరిధిలో హెచపీడీఎస్‌ ద్వారా కొందరికి ట్రాన్స ఫా ర్మర్లు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటికీ ఆత్మకూరులో ఎస్‌ఎస్‌- 1 ట్రాన్సఫార్మర్‌ కింద 100 హెచపీతో 30 మోటార్లు ఆడుతున్నాయని రైతులు వాపోతున్నారు. వీటిలో పలు అక్ర మ కనెక్షన్లు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో మిగిలిన రైతులు లో ఓల్జేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారంటున్నారు. సమస్య పరిష్క రించాలని అధికారులుకు విన్నవించినా ఫలితం లేదంటున్నారు. కొందరు రైతులు డీడీలు తీసి నెలలు గడుస్తున్నా ట్రాన్సఫార్మర్లుగానీ, వైరు ్ఠగానీ అందించలేదం టున్నారు. ఉన్న ట్రాన్సఫార్మర్‌ కూడా లో ఓల్జేజీతో తరుచూ కాలిపోతుండడంతో మరమ్మతులు చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి కైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని లోఓల్టేజీ సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

సబ్‌స్టేషన సామర్థ్యం పెంచే అవకాశం లేదు- దాస్‌, విద్యుత శాఖ ఏఈ, ఆత్మకూరు

సబ్‌స్టేషన పరిధిలో లో ఓల్టేజీ సమస్య ఉన్నది వాస్తవమే. కానీ సబ్‌స్టేషన కెపాసిటి పెంచడాకికి అవకాశం లేదు. స్థలం తగినంత లేకపోవడంతో ఇప్పుడున్న సామర్థ్యం ద్వారానే సబ్‌స్టేషన నుంచి విద్యుత సరఫరా చేయగలుగుతున్నాం. ఏమి చేయలేక పోతున్నాం. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించి రైతుల సమస్యను పరిష్కరించాలి. మా చేతుల్లో ఏమీలేదు. విషయాన్ని ఉన్నతాధి కారుల దృష్టికి తీసుకెళ్లాం. అనుమతులు వచ్చి, తగిన చర్యలు తీసుకుంటే వ్యవసాయానికి, ఇళ్లకు నాణ్యమైన విద్యుత అందిస్తాం.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 10 , 2025 | 12:11 AM