Greevence అర్జీలను శ్రద్ధగా పరిష్కరించాలి : కలెక్టర్
ABN , Publish Date - Apr 07 , 2025 | 11:28 PM
ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు. కలెక్టర్‌లోని సమావేశ భవనంలో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి 220 అర్జీలను స్వీకరిం చారు.

పుట్టపర్తిటౌన, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను అధికారులు ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్ చేతన ఆదేశించారు. కలెక్టర్‌లోని సమావేశ భవనంలో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి 220 అర్జీలను స్వీకరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వచ్చే ప్రజల సమస్యల పరిష్కా రంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈనెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా మండల ప్రత్యేకాధికారులు వారి పరిధిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. హంద్రీనీవా, జాతీయ రహదారులు, రైల్వే భూసేకరణ అంశాలపై అధికారులు సమగ్ర నివేదికలు అందించాలన్నారు. వేసవి, ఎండల దృష్ట్యా వచ్చే వారం నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో జేసీ అభిషేక్‌కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, ఆర్డీఓ సువర్ణ, పరిశ్రమల శాఖ జీఎం నాగరాజు, ల్యాండ్ సర్వే ఏడీ విజయశాంతిబాయి, ఉద్యాన శాఖాధికారి చంద్రశేఖర్, డీసీహెచఓ తిపేంద్రనాయక్, సాంఘిక సంక్షేమశాఖ జిల్లా అధికారి మోహనరావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ మల్లికార్జునయ్య, గ్రామ, సచివాలయ నోడల్ అధికారి సుధాకర్‌రెడ్డి తదితరులున్నారు.