ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CPI : లైనింగ్‌ పనులు ఆపకుంటే ఉద్యమిస్తాం

ABN, Publish Date - Jan 05 , 2025 | 01:11 AM

హంద్రీనీవా కాలువ లైనింగ్‌ పనులు ఆప కుంటే......రైతులతో కలసి ఉద్య మిస్తామని సీపీఐ, రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌ వద్ద శని వారం సీపీఐ, ఏపీ రైతు సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Protesting leaders

సీపీఐ, రైతు సంఘం నాయకులు

అనంతపురం విద్య, జనవరి 4 (ఆంధ్రజ్యోతి) : హంద్రీనీవా కాలువ లైనింగ్‌ పనులు ఆప కుంటే......రైతులతో కలసి ఉద్య మిస్తామని సీపీఐ, రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌ వద్ద శని వారం సీపీఐ, ఏపీ రైతు సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హెచఎనఎస్‌ ఎస్‌ను ఎన్టీఆర్‌ ప్రారంభిస్తే, వైఎస్‌ఆర్‌ నిధు లు కేటాయించి కాలువను త వ్వించారన్నా రు. చంద్రబాబు నాయుడు కాలువ వెడల్పు చేయించి, సాగు, తాగునీటికి కృష్ణా జలాలను మళ్లించడంతో రాయలసీమ ప్రాం తానికి చాలా మంచి జరిగిందన్నారు. అయితే రెండో విడత పనుల్లో భా గంగా కాంక్రీట్‌ లైనింగ్‌ పనులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణం అన్నారు. దీంతో నీరు భూమిలోకి ఇంకిపోవని, ఫలితంగా బోర్లు రీచార్జ్‌ కావన్నారు. కావున హెచఎనఎస్‌ఎస్‌ కాలువ కు లైనింగ్‌ పనులు చేపట్టకుండా కా లువను వెడల్పు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో రైతులు, సంఘాల నేతలు, రాజకీయ నాయ కులు, ప్రజలతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌గౌడ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లాకార్యదర్శి కుళ్లాయిస్వామి, ఇతర నేతలు నరేంద్ర, విజయ్‌, రమేష్‌, చలపతి, వెంకటరాముడు, రెడ్డప్ప, నారా యణస్వామి, దుర్గాప్రసాద్‌, రాజు, మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jan 05 , 2025 | 01:11 AM