Share News

AP News: శ్రీసత్యసాయి జిల్లాలో అమానుష ఘటన.. మహిళ జుట్టు కత్తిరించి..

ABN , Publish Date - Jan 16 , 2025 | 10:12 AM

శ్రీసత్యసాయి జిల్లా, పెనుగొండ మండలం, మునిమడుగు గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది, ప్రేమ వ్యవహారంలో మహిళ సహకరించిందనే నేపంతో ఆమెపై మహిళలే దాడి చేసి.. వివస్త్రను చేసి జుట్టు కత్తిరించారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

AP News: శ్రీసత్యసాయి జిల్లాలో అమానుష ఘటన.. మహిళ జుట్టు కత్తిరించి..

శ్రీసత్యసాయి: జిల్లాలో దారుణం (Cruelty) జరిగింది. ఓ మహిళా జుట్టు కత్తిరించి (Women hair cut) వివస్త్రను చేశారు. ఈ ఘటనపై పోలీసులు (Police) దర్యాప్తు ముమ్మరం చేశారు. మునిమడుగులో ఓ ప్రేమ జంట (Love couple) ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కారణమంటూ ఆమెపై దాడి చేశారు. జట్టు కత్తిరించి వివస్త్రను చేశారు. వైఎస్సార్‌సీపీకి చెందినవారే ఈ దాడి చేయించారని బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటనపై జిల్లా డీఎస్సీ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. దాడి చేసిన వారంతా బాధితురాలి బంధువులేనని పోలీసులు చెబుతున్నారు. అమ్మాయి మైనర్ కావడంతో ఎత్తుకువెళ్లిన యువకుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఊరిలో వారి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని, అందులో భాగంగానే మహిళపై దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఈ వార్త కూడా చదవండి..

కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు.. ఎందుకంటే..


శ్రీసత్యసాయి జిల్లా, పెనుగొండ మండలం, మునిమడుగు గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది, ప్రేమ వ్యవహారంలో మహిళ సహకరించిందనే నేపంతో ఆమెపై మహిళలే దాడి చేసి.. వివస్త్రను చేసి జుట్టు కత్తిరించారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ గ్రామంలో వారం రోజుల క్రితం మైనర్ బాలిక, అనిల్ అనే యువకుడు.. ఇద్దరూ ప్రేమించుకుని ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆ ప్రేమ జంటకు సహకరించిందనే కారణంతో అమ్మాయి కుటుంబసభ్యులు మహిళపై దాడి చేసి జుట్టు కత్తిరించారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను చాలా అవమానపరిచారని, గ్రామంలో తలెత్తుకుని తిరగలేని పరిస్థితి అని పేర్కొంది.


అయితే ప్రేమ వ్యవహారంలో తనకు ఎటువంటి సంబంధం లేదని.. అనవసరంగా తనపై దాడి చేసి తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలు సెక్షన్లకింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అలాగే ప్రేమ పేరుతో మైనర్ బాలికను లోబరుచుకున్నాడంటూ అనిల్‌పై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడివాడలో ప్రాణం తీసిన సిగరెట్...

తిరుమలలో భక్తుల రద్దీ.. వైకుంఠ ద్వారా దర్శనం

కోట్లలో కూత

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 16 , 2025 | 10:16 AM