GOD : కాలభైరవుడికి కుంభాభిషేకం

ABN, Publish Date - Feb 27 , 2025 | 01:12 AM

మండలపరిధిలో ని సిద్దరాంపురం గ్రామంలో పురాతనమైన కాలభైరవ స్వామి దేవాలయం గోపుర పునఃప్రతిష్ఠ సందర్భంగా బుధవారం ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. మూడు రోజుల నుంచి దేవాలయంలో వేదపండితులు పలు పూజా కార్యక్రమాలు నిర్వహిం చారు.

GOD :  కాలభైరవుడికి కుంభాభిషేకం
RDO Kesavanaidu, leaders Keshavareddy and Ramalinga Reddy participated in the pujas

బుక్కరాయసముద్రం, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలో ని సిద్దరాంపురం గ్రామంలో పురాతనమైన కాలభైరవ స్వామి దేవాలయం గోపుర పునఃప్రతిష్ఠ సందర్భంగా బుధవారం ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. మూడు రోజుల నుంచి దేవాలయంలో వేదపండితులు పలు పూజా కార్యక్రమాలు నిర్వహిం చారు. బుధవారం మహా శివరాత్రి పర్వదినం పురస్కరించు కుని గోపుర పునఃప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవానికి అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడు, టీడీపీ సీనియర్‌ నాయకుడు ముంటిమడుగు కేశవరెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి తదితరులు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన జయరామిరెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Feb 27 , 2025 | 01:12 AM