Share News

Liquor Case On Woman: రెచ్చిపోయిన యువకుడు.. అక్రమ కేసు పెట్టారంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే..

ABN , Publish Date - Apr 14 , 2025 | 09:35 PM

మడకశిర ఎస్సీ కాలనీలో రెండ్రోజులుగా జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బంధువులను పిలుచుకున్న స్థానికులు వేడుక ఘనంగా చేసుకోవాలని అనుకున్నారు. ఈ మేరకు చుట్టాలందరికీ చుక్కా, ముక్కా ఏర్పాట్లు చేశారు.

Liquor Case On Woman: రెచ్చిపోయిన యువకుడు.. అక్రమ కేసు పెట్టారంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే..
Madakasira

శ్రీ సత్యసాయి జిల్లా: తమ కుటుంబంపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టారని ఓ యువకుడు గొంతు కోసుకున్న ఘటన మడకశిరలో చోటు చేసుకుంది. ఏ తప్పూ చేయకుండానే పోలీసులు తమని వేధిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన యువకుడు.. పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగాడు. అన్యాయంగా కేసు పెట్టారని, వెంటనే దాన్ని కొట్టివేయాలని డిమాండ్ చేశాడు. అనంతరం ఆగ్రహంతో ఊగిపోయి వెంట తెచ్చుకున్న బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. అతన్ని నిలువరించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.


అసలేం జరిగిందంటే..

మడకశిర ఎస్సీ కాలనీలో రెండ్రోజులుగా జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బంధువులను పిలుచుకున్న స్థానికులు వేడుక ఘనంగా చేసుకోవాలని అనుకున్నారు. ఈ మేరకు చుట్టాలందరికీ చుక్కా, ముక్కా ఏర్పాట్లు చేశారు. అయితే ఎస్సీ కాలనీలో అక్రమ మద్యం ఉందని ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఇంట్లో కొన్ని మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. అనంతరం ఇంటి యజమాని సహా అతని భార్యపై కేసు నమోదు చేశారు.


అయితే మహిళపై కేసు నమోదు చేయడాన్ని స్థానికులు, ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంట్లో ఉన్న రెండేళ్ల చిన్నారి తల్లిపై కేసు నమోదు చేయడంపై మండిపడ్డారు. ఈ మేరకు బంధువులంతా కలిసి మడకశిర ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. భర్త ఇంట్లో మద్యం ఉంచితే భార్యపై కేసు నమోదు చేయడం ఏంటని బంధువులు ఆగ్రహించారు. జాతర సందర్భంగా తాగేందుకు మద్యం తెచ్చుకున్నామే తప్ప అమ్మేందుకు కాదని చెప్పారు.


ఈ క్రమంలోనే తన అక్క, భావపై పోలీసులు అక్రమ కేసు బనాయించారని మహిళ సోదరుడు ఆగ్రహించాడు. పోలీసులకు వ్యతిరేకంగా స్టేషన్ ఎదుట నినాదాలు చేశాడు. అక్రమ కేసును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో గొంతు కోసుకున్నాడు. దీంతో స్థానికులు హుటాహుటిన అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో అక్కడంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి:

Ambedkar Jayanti: అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం: సీఎం చంద్రబాబు

Anna Lezhneva Donation: కుమారుడి పేరుపై అన్నా కొణిదెల భారీ విరాళం

Updated Date - Apr 14 , 2025 | 09:36 PM