MLA : వైసీపీ ప్రభుత్వంలో అనర్హులకే పింఛన్లు
ABN , Publish Date - Mar 02 , 2025 | 01:09 AM
గత ఐదేళ్ల వైసీపీ హయాంలో దివ్యాంగుల పింఛన్లు అనర్హులకు ఎక్కువగా అందాయని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మండలం లోని కక్కలపల్లి కాలనీ పంచాయతీలోని సుందరయ్య కాలనీలో ఆమె పింఛన్లు పంపిణీ చేశా రు.

ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం రూరల్, మార్చి 1(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల వైసీపీ హయాంలో దివ్యాంగుల పింఛన్లు అనర్హులకు ఎక్కువగా అందాయని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మండలం లోని కక్కలపల్లి కాలనీ పంచాయతీలోని సుందరయ్య కాలనీలో ఆమె పింఛన్లు పంపిణీ చేశా రు. ఈఓఆర్డీ వెంకటనాయుడు, మండల కన్వీనర్ జింకా సూర్య నారా యణ, మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్, మండల ప్రధాన కార్యదర్శి పా మురాయి రఘు, మాజీ మండల కన్వీనర్ చల్లా జయకృష్ణ, సీనియర్ నాయకులు పతకమూరి శ్రీనివాసులు, మాజీ సర్పంచు సుశీలమ్మ తదితరులతో కలసి ఆమె ఇంటింటికి వెళ్లి, లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించారన్నారు. కార్యక్రమంలో సచివాలయం కార్యదర్శి పవన కుమార్, కూటమి నాయకులు బొట్టు రామాంజి, రామకృష్ణ, కమాల్‌బీ, బాబా, రాజేంద్ర, చెన్నప్ప, ఇమాముల్, ఈడిగ సూరి, రామాంజి నేయులు, లింగయ్య, అల్లీపీర, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.