Share News

SP Ratna: హెలికాఫ్టర్ ధ్వంసం ఘటన.. ఆ ప్రచారం నమ్మెుద్దు: ఎస్పీ రత్న..

ABN , Publish Date - Apr 08 , 2025 | 08:42 PM

తాము అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు విప్పిస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ రత్న స్పందించారు. పోలీస్ యూనిఫామ్ ఎవరో తమకు ఇచ్చింది కాదని, తాము కష్టపడి సాధించామని చెప్పారు.

SP Ratna: హెలికాఫ్టర్ ధ్వంసం ఘటన.. ఆ ప్రచారం నమ్మెుద్దు: ఎస్పీ రత్న..
Sri Sathya Sai SP Ratna

శ్రీ సత్యసాయి జిల్లా: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటనలో హెలికాఫ్టర్ ధ్వంసం ఘటనపై ఎస్పీ రత్న స్పందించారు. జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు భద్రత కల్పించలేదని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. మాజీ సీఎం పర్యటనకు నిబంధనలకు అనుగుణంగా భద్రత కల్పించినట్లు రత్న తెలిపారు. ఇద్దరు ఎస్పీలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. హెలిప్యాడ్ వద్ద తొలుత సుమారు 150 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు, ఆ తర్వాత జనం ఎక్కువ అవడంతో మరో 100 మందితో భద్రత పెంచినట్లు తెలిపారు.


ఈ సందర్భంగా ఎస్పీ రత్న మాట్లాడుతూ.."మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా చర్యలు తీసుకున్నాం. వైసీపీ నేతలకు చెప్పినా వినకుండా కార్యకర్తలను పెద్దఎత్తున సమీకరించారు. దీంతో హెలిప్యాడ్ వద్ద భారీగా జనం గుమిగూడారు. హెలిప్యాడ్ వద్ద మెుదట 150 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశాం. ఆ తర్వాత కార్యకర్తలు ఎక్కువగా రావడంతో మరో 100 మందితో భద్రత పెంచాం. హెలిపాడ్ వద్ద వైపునకు ఒకేసారి భారీగా వైసీపీ కార్యకర్తలు రావడంతో చిన్నపాటి తోపులాట జరిగింది.


హెలీప్యాడ్ వద్ద కొంతమంది ఛాపర్ డోర్ లాగడంతో అది దెబ్బతిన్నది. దీంతో పైలట్లు వీవీఐపీని తీసుకెళ్లలేమని తేల్చి చెప్పారు. దీంతో వైఎస్ జగన్ రోడ్డుమార్గం ద్వారా బెంగళూరు పయనమయ్యారు. హెలిప్యాడ్‌పై ఎక్కడా రాళ్లు కానీ, కర్రలు కానీ వేయలేదు. ఈ విషయాన్ని పైలట్ కూడా ధ్రువీకరించారు. జగన్ పర్యటనకు భారీగా బందోబస్తు కల్పించాం. పోలీసులను రెచ్చగొట్టేందుకు కొంతమంది కవ్వించినా వారెక్కడా సహనం కోల్పోలేదు. పోలీసులంతా సంయమనంతో వ్యవహరించారు. ఘటనకు సంబంధించి అన్ని వీడియో ఫుటేజ్‌లు పరిశీలిస్తున్నామని" చెప్పారు.


కాగా, మరోవైపు తాము అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు విప్పిస్తామని జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎస్పీ రత్న స్పందించారు. పోలీస్ యూనిఫామ్ ఎవరో తమకు ఇచ్చింది కాదని, తాము కష్టపడి సాధించామని చెప్పారు. ఒకవేళ పోలీసులు తప్పు చేస్తే సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. తామంతా నిబద్ధతతో పని చేస్తున్నామని, ఎవ్వరికీ అనుకూలంగా వ్యవహారించడం తేల్చి చెప్పారు. కాగా, హెలీప్యాడ్ వద్ద పోలీసులు భద్రత కల్పించలేదని వైసీపీ చేసిన ఆరోపణలకు ఎస్పీ రత్న సమాధానాలు గట్టి కౌంటర్ ఇచ్చినట్లు అయ్యింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Jalaharati Corporation: సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. నూతన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ..

Bandi Sanjay: రేవంత్ రెడ్డి, కేటీఆర్‌కు ఇదే నా సవాల్.. సిద్ధమా?: కేంద్ర మంత్రి బండి సంజయ్..

Mark Shankar Health Update: మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్.. పూర్తి వివరాలు చెప్పిన మంత్రి..

Updated Date - Apr 08 , 2025 | 08:43 PM