PROGRESS : మారుతున్న పల్లెల రూపురేఖలు
ABN, Publish Date - Jan 20 , 2025 | 12:20 AM
కూటమి ప్రభుత్వం రాకతో పల్లెల రూపురేఖలు మారాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీల నిధులు పక్కదారి పట్టడంతో గ్రామాలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. కనీసం వీధిలైట్ల మరమ్మతులు చేయించుకోలేని దుస్థితిలో పంచాయతీలు ఉండేవి. ఎన్నికల అనంతరం టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే గ్రామీణ సమస్యలపై దృష్టి సారించింది.
శింగనమల, జనవరి 19(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రాకతో పల్లెల రూపురేఖలు మారాయి. గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీల నిధులు పక్కదారి పట్టడంతో గ్రామాలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. కనీసం వీధిలైట్ల మరమ్మతులు చేయించుకోలేని దుస్థితిలో పంచాయతీలు ఉండేవి. ఎన్నికల అనంతరం టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే గ్రామీణ సమస్యలపై దృష్టి సారించింది. నియోజకవర్గంలోని శింగనమల, గార్లదిన్నె, నార్పల, పుట్లూరు, యల్లనూరు, బుక్కరాయసముద్రం మండలాల్లో గత ఐదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని పల్లెలు నేడు అభివృద్ధి బాట పట్టాయి. గత వైసీపీ ప్రభుత్వంలో వీధుల్లో సీసీ రోడ్లు లేకపోవడంతో గ్రామీణులు ఎగుడు దిగుడు గుంతల రోడ్లుతోనే కాలంగడిపారు. మురుగుకాలువలు లేకపోవడంతో చిన్న పాటి వర్షం వచ్చినా వీధులున్నీ బురదమయం అయ్యేవి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన అర్నెల్లలోనే పల్లె పండగ పేరుతో గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజ్ కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి నియోజకవర్గంలోని ఆరు మండలాలకు సీసీరోడ్లుకు రూ.17 కోట్లు మంజూరు చేసింది. పల్లెల్లో పనులు చేయడానికి చాలా మంది కాంట్రాక్టర్లు ఉత్సహంగా మందుకొచ్చారు. ఇప్పటికే నాణ్యతతో కూడి పనులు 80 శాతం పూర్తి అయినట్లు అధికారులు తెలుపుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పనులు చేసినా బిల్లులు రాకపోవడంతో గతంలో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి మందుకు రాలేదు. ఇప్పుడు పనులు పూర్తి అయిన వెంటనే బిల్లులు మంజారు అవడంతో పల్లెల్లో అభివృద్ధి వేగంగా మందుకు సాగుతోంది.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jan 20 , 2025 | 12:20 AM