SANKRANTI : సంక్రాంతి తరువాత కూల్చివేతేనా..?
ABN, Publish Date - Jan 10 , 2025 | 12:31 AM
నగరంలోని నాలుగురోడ్ల రహదారి దాదాపు పూర్తయింది. కానీ కీలకమైన కూడలి విషయంలో ముక్తాయింపు పలకడంలో సందిగ్థం నెలకొంది. దాదాపు నాలుగేళ్ల క్రితం నగరంలోని పంగల్‌రోడ్డు నుంచి బళ్లారి బైపాస్ వరకు 9. 2 కిలోమీటర్ల మేర ఫోర్‌లేన రహదారి నిర్మాణానికి టెండరు పిలిచారు.
సంక్రాంతి తరువాత కూల్చివేతేనా..?
నగరంలో ఫోర్‌లేన రోడ్డు ముక్తాయింపుపై సందిగ్థం
సప్తగిరి సర్కిల్ మసీదు కాంప్లెక్స్ తొలగింపుపై రాని స్పష్టత
అనంతపురం క్రైం, జనవరి 9(ఆంధ్రజ్యోతి) : నగరంలోని నాలుగురోడ్ల రహదారి దాదాపు పూర్తయింది. కానీ కీలకమైన కూడలి విషయంలో ముక్తాయింపు పలకడంలో సందిగ్థం నెలకొంది. దాదాపు నాలుగేళ్ల క్రితం నగరంలోని పంగల్‌రోడ్డు నుంచి బళ్లారి బైపాస్ వరకు 9. 2 కిలోమీటర్ల మేర ఫోర్‌లేన రహదారి నిర్మాణానికి టెండరు పిలిచారు. రూ. 275 కోట్ల నిధులతో రహదారి పూర్తయింది. తాజాగా లైట్లు వేశారు. కానీ ఈ రహ దారి నిర్మాణం విషయంలో ఎన్నో ఆరోపణలు, విమర్శలు వ్యక్తమయ్యా యి. రోడ్డు విస్తరణకు సంబంధించి సుభాష్‌రోడ్డులో 85 నుంచి 95 అడుగులకే కుంచించుకుపోయిందనే విమర్శలొచ్చాయి. సర్వే విభాగం అధికారులు ఆ రోడ్డులోని భవనాలను తొలగించేవిధంగా మార్కింగ్ వేసినప్పటికీ చివరకు ఆ స్థాయిలో విస్తరించలేకపోయారు. ఇదిలా ఉండ గా ఆ రోడ్డు వంకరటింకరగా ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. టవర్‌క్లాక్ సర్వీస్ రోడ్డు పూర్తికాకపోవడం రహదారికి మచ్చగా మిగిలిపోయింది. అత్యంత ప్రధానమైన సప్తగిరి సర్కిల్ విస్తరణకు నోచుకోకపోవడమూ ప్రధాన సమస్యగా మారింది. ఆ ప్రాంతంలో పరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నా భవనాల తొలగింపు విషయంలో సందిగ్థం నెలకొంది. ఈ నెల సంక్రాంతి పండుగ అనంతరం వాటిని తొలగిస్తారనే ప్రచారం జరు గుతోంది. మరి ఎంతమాత్రం సఫలీకృతులవుతారో వేచి చూడాల్సిందే.
సప్తగిరి సర్కిల్ రూపు మారేనా..?
నగరంలోని నడిబొడ్డున ఉన్న సప్తగిరి సర్కిల్ నిత్యం రద్దీగా ఉంటుంది. వాహనాల రాకపోకలతో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతూ వ స్తోంది. ఫోర్‌లేన రోడ్డు పూర్తయినా ఈ చౌరస్తా విస్తరణ చేయకపోవడం సమస్యగా మారింది. అక్కడ రోడ్డు 30 నుంచి 50 అడుగుల వరకే కనిపిస్తోంది. విస్తరణలో భాగంగా సర్కిల్ పరిధిలో భవనాలు తొల గించేందుకు గత ఏడాదిలో ఆర్‌అండ్‌బీ నేషనల్ హైవే అధికారులు దాదాపు రూ.90 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. కానీ కేవలం రూ. 24కోట్ల నిధుల మంజూరుకు ఓకే అయినట్లు తెలిసింది. ఈ నిధులతో ఎంతవరకు సర్దుబాటు చేయగలరనేది ప్రశ్నార్థకంగా మారింది.
24 అడుగులకు 12 అడుగులే ఇస్తామంటున్నారు
నాలుగు లైన్ల రోడ్డు విస్తరణలో భాగంగా సుభాష్‌రోడ్డులో ఇప్పటికే రోడ్డు పూర్తయింది. లలితకళాపరిషత ముందు భాగాన్ని సైతం ఎప్పుడో తొలగించారు. ఇప్పుడు అక్కడ మసీదు కాంప్లెక్స్ తొలగించాల్సి ఉంది. మరో వైపు నితినకాంప్లెక్స్, కుడివైపు ఉన్న మరో బిల్డింగ్‌లలో కొంత భాగం తొలగించనున్నారు. మసీదు కాంప్లెక్స్ తొలగిస్తే మిగిలిన భవనాల ను తొలగించేందుకు వివాదముండదనే అభిప్రాయంలో అధికారులు ఉన్నారు. గత మూడు నెలలుగా మసీదు కాంప్లెక్స్ తొలగింపు అంశంపై కమిటీ నిర్వాహకులు, మత పెద్దలతో అధికారులు సమావేశమవుతూ వస్తున్నారు. వాస్తవానికి అక్కడ విస్తరణకు 24అడుగులు తీయాల్సి ఉం ది. కానీ నిర్వాహకులు, మతపెద్దలు కేవలం 12 అడుగులవరకే కాంప్లెక్స్ లోని దుకాణాలను తొలగించాలంటున్నారు. కానీ ఆర్‌అండ్‌బీ ఎనహెచ అధికారులు మాత్రం కనీసం 17అడుగులైనా ఇవ్వకపోతే విస్తరణ సాధ్యం కాదని చెబుతున్నారు. అటు మధ్యవర్తులుగా ఉన్న రెవెన్యూ అధికారులు 15అడుగులు వదలాలని కోరుతున్నారు. మరో వారం రోజుల్లో ఫైనల్‌గా సమావేశమై స్పష్టత తీసుకోవాలని అధికారులు పట్టుదలగా ఉన్నారు.
సర్వీస్ రోడ్డులో ఆ ఒక్క బిల్డింగే...
టవర్‌క్లాక్ నుంచి కోర్టు రోడ్డుకు వెళ్లే సర్వీస్ రోడ్డు ఫోర్ లేన రోడ్డు ప్రారంభం నుంచి అలాగే ఉంది. గుంతలు, కంకరతోనే ఉండిపోయింది. వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. ఈ మధ్యనే ఆ రోడ్డులోని భవనాల ముందు భాగం తొలగించారు. కానీ ఓ భవనం యజమాని కోర్టుకెళ్లడంతో సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో చెప్పలేని పరిస్థితి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....
Updated Date - Jan 10 , 2025 | 12:31 AM