Weather Updates: మరో 3 గంటల్లో ఈ ప్రాంతంలో భారీ వర్షం..
ABN , Publish Date - Apr 15 , 2025 | 04:06 PM
Weather Updates: ఎండలు దంచికొడుతున్న వేళ.. చల్లటి కబురును ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే, చల్లటి కబురే కాదండోయ్.. కాస్త జాగ్రత్తగా కూడా ఉండాలని హెచ్చరించింది. ..

విశాఖపట్నం, ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన జారీ చేసింది. ఎండలు దంచికొడుతున్న వేళ.. చల్లటి కబురును ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే, చల్లటి కబురే కాదండోయ్.. కాస్త జాగ్రత్తగా కూడా ఉండాలని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు అలర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. వర్షంతో పాటు.. ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఉందని ప్రకటించారు. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఈ ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని.. ఈ ప్రాంతాల వారు అలర్ట్‌గా ఉండాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా.. వ్యవసాయం కోసం పొలాల వద్దకు వెళ్లిన రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ రోణంకి కూర్మనాథ స్పష్టం చేశారు.
విచిత్ర వాతావరణం..
ఏపీలో విచిత్ర వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఉదయం మొదలు.. సాయంత్రం వరకు ఎండలు దంచికొండుతున్నాయి. సాయంత్రం అవగానే చాలు వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఇలా పొద్దంతా ఎండ.. సాయంత్రమవగానే వానలతో విచిత్ర వాతావరణ పరిస్థితులు ఉంటున్నాయి. ఈ అకాల వర్షం కారణంగా చేతికందిన పంటలు వర్షార్పణం అవుతున్నాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.
Also Read:
ఈ ప్రయాణం నిజంగా అవుటాఫ్ 10 బై 10..
రాష్ట్రంలో 2,260 టీచర్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ
For More Andhra Pradesh News and Telugu News..