Share News

మరో రూ.69 వేల కోట్ల సమీకరణ!

ABN , Publish Date - Apr 15 , 2025 | 12:22 AM

రాజధాని నిర్మాణానికి మరో రూ.69 వేల కోట్ల మేర నిధులను సమీకరించాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో వంటి సంస్థల నుంచి సీఆర్‌డీఏ రూ.31 వేల కోట్లను రుణాలుగా పొందిన సంగతి తెలిసిందే. అమరావతి విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో మరిన్ని ప్రాజెక్టులకు సిద్ధమవుతున్న దశలో నిధుల అవసరం మరింతగా ఏర్పడుతోంది. దీనికోసం మరో రూ.69 వేల కోట్ల నిధులను సమీకరించేందుకు సీఆర్‌డీఏ ప్రయత్నాలు చేస్తోంది.

మరో రూ.69 వేల కోట్ల సమీకరణ!

- అమరావతి రాజధాని కోసం సీఆర్‌డీఏ ప్రణాళిక

- ముందుకొస్తున్న జాతీయ బ్యాంకుల కన్సార్టియం

- సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో బ్యాంకర్లతో అధికారుల చర్చలు

- ఇప్పటికే రూ.31 వేల కోట్ల మేర సంస్థల నుంచి సమీకరణ

- ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూల నుంచి..

- తాజాగా బ్యాంకుల కన్సార్టియం నుంచి తీసుకోవాలని నిర్ణయం

- అమరావతిలో భూముల ధరలు పెరగగానే విక్రయించి బ్యాంకులకు చెల్లింపు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

రాజధాని నిర్మాణానికి మరో రూ.69 వేల కోట్ల మేర నిధులను సమీకరించాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో వంటి సంస్థల నుంచి సీఆర్‌డీఏ రూ.31 వేల కోట్లను రుణాలుగా పొందిన సంగతి తెలిసిందే. అమరావతి విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న నేపథ్యంలో మరిన్ని ప్రాజెక్టులకు సిద్ధమవుతున్న దశలో నిధుల అవసరం మరింతగా ఏర్పడుతోంది. దీనికోసం మరో రూ.69 వేల కోట్ల నిధులను సమీకరించేందుకు సీఆర్‌డీఏ ప్రయత్నాలు చేస్తోంది. విజయవాడలోని సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో పలు జాతీయ, ప్రైవేటు బ్యాంకులతో సీఆర్‌డీఏ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే పలు జాతీయ బ్యాంకులు రుణాలు ఇవ్వటానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. కొన్ని జాతీయ బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడి రుణం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే అంగీకారం తెలిపిన మేరకు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కోల నుంచి మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌ విడుదలైంది. ఇవి కాకుండా మరో 40 వేల కోట్ల రూపాయలను యుద్ధ ప్రాతిపదికన సమకూర్చుకునేందుకు సీఆర్‌డీఏ అధికారులు బ్యాంకులతో ప్రయత్నాలు చేస్తున్నారు.

భూముల విలువ పెరిగిన వెంటనే..

బ్యాంకుల నుంచి అదనంగా తీసుకునే రూ.69 వేల కోట్ల రుణాన్ని రాజధానిలో ప్రభుత్వం కింద ఉన్న భూముల విలువ పెరిగిన వెంటనే వాటిని విక్రయించి బ్యాంకులకు చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకోవాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. రాజధాని నగరాన్ని సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సిటీగా అభివృద్ధి చేయాలన్నది సీఆర్‌డీఏ అభిప్రాయంగా ఉంది. రాజధాని అమరావతిని మరింత విస్తరించి సకల సదుపాయాలు కల్పించడంతో పాటు ఆర్థికంగా కూడా స్వయం సమృద్ధి సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. రాజధాని పరిసరాల్లో ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. దీని కోసం రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్‌ ఇండసి్ట్రయల్‌ సిటీ, స్పోర్ట్స్‌ సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కేవలం ప్రభుత్వ పాలనకే రాజధాని పరిమితం కాకుండా ఆర్థిక ప్రగతి కూడా సాధించే విధంగా ఉండాలని ప్రపంచ బ్యాంకు చేసిన సూచనను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. అందుకే మరో పది వేల ఎకరాలను భూ సమీకరణ కానీ భూ ేసకరణ ద్వారా కానీ ేసకరించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాల్లో రూ.47 వేల కోట్ల వ్యయంతో పిలిచిన టెండర్లకు సంబంధించి చూస్తే.. అఖిల భారత సర్వీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాల్గవ తరగతి ఉద్యోగుల భవనాలను ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సీఆర్‌డీఏ అధికారులు నిర్ణయించారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్‌ ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన ఏడాదిన్నరలో పూర్తి చేయాలని కాంట్రాక్టు సంస్థలకు సీఆర్‌డీఏ కాలపరిమితి విధించింది. సచివాలయ టవర్స్‌, ఇతర భవనాలతో పాటు అసెంబ్లీ, హైకోర్టు వంటి భవనాలు మూడు సంవత్సరాల్లో పూర్తి చేసి తీరాల్సిందేనని దీనికి సంబంధించిన కార్మికులతో పాటు సామగ్రిని త్వరితగతిన ేసకరించి వెంటనే రంగంలోకి దిగాలని కాంట్రాక్టు సంస్థలకు మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. రాజధాని అమరావతిలో పరిపాలనా నగర నిర్మాణ పనులను ఎట్టి పరిస్థితులలో రాబోయే మూడు సంవత్సరాల్లో పూర్తి చేేస విధంగా పటిష్ట ప్రణాళికలను రూపొందించారు. ఈ రాజధాని పరిపాలనా నగర నిర్మాణం వచ్చే నెల మొదటి వారం నుంచి పూర్తి స్థాయిలో ఊపందుకోనుందని అధికార యంత్రాంగం చెబుతోంది.

Updated Date - Apr 15 , 2025 | 12:22 AM