Share News

AP-WFP Agreement: ప్రపంచ ఆహార పథకంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

ABN , Publish Date - Apr 16 , 2025 | 06:15 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రపంచ ఆహార పథకంతో ఒప్పందం కుదుర్చుకున్నది. ముందుగా కడప జిల్లాలో చిన్న, సన్నకారు రైతుల కోసం వాతావరణ అనుకూలత కల్పించే ప్రాజెక్టును అమలు చేయనున్నారు.

AP-WFP Agreement: ప్రపంచ ఆహార పథకంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

ముందుగా కడప జిల్లాలో అమలుకు నిర్ణయం

రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులకు వాతావరణ అనుకూలత కల్పించే ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం చేసేందుకు ఐక్యరాజ్య సమితి సౌజన్యంతో ప్రపంచ ఆహార పథకంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది. మంగళవారం అమరావతి సచివాలయంలో వ్యవసాయ శాఖ ఎక్స్‌ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌, ప్రపంచ ఆహార పథకం డైరెక్టర్‌ ఎలిజబెత్‌ ఫెయిరీ ఒప్పంద లేఖ(లెటర్‌ ఆఫ్‌ అండర్‌స్టాండ్‌)పై సంతకాలు చేశారు. శ్రీలంక, భారత్‌లో ప్రాంతీయ వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా వాతావరణ, వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నాయి. ఈ ప్రణాళికను ముందుగా కడప జిల్లాలో ఏపీ రైతుసాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలు చేయనున్నారు. రాష్ట్రంలో ఐదేళ్ల పాటు అమలు చేయాలని నిర్ణయించారు.

Updated Date - Apr 16 , 2025 | 06:15 AM