Capital Amaravati: మరో 30 వేల ఎకరాల భూ సమీకరణకు రంగం సిద్ధం
ABN , Publish Date - Apr 13 , 2025 | 08:56 PM
Capital Amaravati: రాష్ట్ర విభజనతో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశ చిత్ర పటంలో నిలిచిపోయింది. అదే సమయంలో ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం రాష్ట్ర రాజధాని కోసం అన్వేషణ ప్రారంభించింది.

అమరావతి, ఏప్రిల్ 14: రాజధాని అమరావతి పునర్ నిర్మాణానికి కూటమి సర్కార్ సన్నద్దమవుతోంది. ఆ క్రమంలో రాజధాని భవిష్యత్తు అవసరాలను దృష్టి పెట్టుకొని ముందుకు వెళ్లాలని యోచిస్తోంది. ప్రస్తుతం 29 గ్రామాల్లోని 33 వేల ఎకరాల భూమిని రైతుల నుంచి రాజధాని కోసం.. ప్రభుత్వం ల్యాండింగ్ పూలింగ్ ద్వారా సేకరించింది. అయితే రాజధాని అమరావతి భవిష్యత్తు అవసరాలను దృష్టి పెట్టుకొని మరో 30 వేల ఎకరాలకు పైగా భూమి సమీకరణకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతి కోసం మరో 44 వేల ఎకరాల భూమి సమీకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తూళ్లురు, అమరావతి, తాడికొండ, మంగళగిరిలో ఈ భూ సమీకరణ చేపట్టనున్నట్లు సమాచారం. అయితే రాజధాని ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే కేంద్రం ఓకే చెప్పింది. దీనికి తోడు రాజధాని గ్రామాలను తాకుతూ.. ఇన్నర్ రింగ్ రోడ్డు సైతం రానుంది. ఈ రెండింటికి మధ్య తాడికొండ, తూళ్లురు, అమరావతి మండలాల్లోని కొన్ని గ్రామాల్లో రైల్వే ప్రాజెక్టులతోపాటు ఇతరు ప్రాజెక్టల కోసం ఇక్కడి భూముల కొంత భాగాన్ని ల్యాండ్ పూలింగ్ కిందకు తీసుకు రావాలని భావించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వం ముందుగా తమను ఒక దారికి తీసుకు వచ్చిన తర్వాత విస్తరణకు వెళ్లితే బావుంటుందనే అభిప్రాయం రాజధాని రైతుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాజధానిలో సమస్యలు ఉన్నాయని.. వాటి పరిష్కారంపై దృష్టి సారించాలని వారు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర విభజనతో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశ చిత్ర పటంలో నిలిచిపోయింది. అదే సమయంలో ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వం రాష్ట్ర రాజధాని కోసం అన్వేషణ ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తం అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో రాజధాని ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో గుంటూరు జిల్లా తూళ్లురు, వెలగపూడి పరిసర గ్రామాలతోపాటు మరో 27 గ్రామాలతో రాజధాని నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఆ క్రమంలో రాజధాని నిర్మాణం కోసం వేలాది ఎకరాలను ఆయా ప్రాంతాల్లోని ప్రజలను, రైతులను ఒప్పించి ప్రభుత్వం తీసుకుంది.
అలా రాజధాని అమరావతి నిర్మాణం ప్రారంభమైంది. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. 2019లో ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం కొలువు తీరింది. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా రాజధాని అమరావతికి అసెంబ్లీలో మద్దతు ప్రకటించిన వైఎస్ జగన్.. అదే అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా మూడు రాజధానులంటూ కీలక ప్రకటన చేశాడు. దీంతో రాజధానికి భూములు ఇచ్చిన రైతుల్లో అలజడి ప్రారంభమైంది. ఆ అలజడి.. ఐదేళ్ల పాటు సాగింది. ఇక 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత కానీ రైతుల్లో ఆ అలజడి తగ్గలేదంటే అతిశయోక్తి కాదన్నది సుస్పష్టం. అలా చంద్రబాబు సారథ్యంలో మళ్లీ రాజధాని అమరావతి పునర్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. దీంతో ముందు తమ సమస్యలు పరిష్కరించి.. ఆ తర్వాత రాజధాని విస్తరణ చేపడితే బావుంటుందనే అభిప్రాయం ఆ ప్రాంతా రైతులు, ప్రజలల్లో వ్యక్తమవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ
AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
For AndhraPradesh News And Telugu News