K. Rammohan Naidu: ప్రధాని మోదీ పర్యటన.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సంచలన వ్యాఖ్యలు
ABN, Publish Date - Jan 09 , 2025 | 04:12 PM
K. Rammohan Naidu: ప్రధాని నరేంద్ర మోదీ.. విశాఖపట్నం పర్యటనపై కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కే.రామ్మోహన్ నాయుడు స్పందించారు. విశాఖపట్నానికి త్వరలో ఐటీ సంస్థలు వస్తు్న్నాయని తెలిపారు.
విశాఖపట్నం, జనవరి 09: విశాఖపటాన్ని ఐటీకి ప్రధాన కేంద్రంగా తయారు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే. రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. అందులోభాగంగా త్వరలో ఐటీ దిగ్గజ సంస్థలు.. విశాఖపట్నంకు రానున్నాయని తెలిపారు. విశాఖపట్నం అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాయని చెప్పారు. ప్రపంచంలోనే విశాఖను గర్వ కారణమైన నగరంగా తయారు చేయాలని ముందుకు వెళుతోన్నాయని పేర్కొన్నారు.
విశాఖపట్నం వేదికగా డిజిటల్ టెక్నాలజీ రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతోంది. రెండో రోజు గురువారం జరుగుతోన్న ఈ సదస్సులో పాల్గొన్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. నిన్న విశాఖపట్నంలో ప్రధాని మోదీ రోడ్ షో, బహిరంగ సభ నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా జరిగాయని సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారని గుర్తు చేశారు. ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారన్నారు.
ఉత్తరాంధ్రవాసుల చిరకాల కొరిక దక్షిణ కోస్తా రైల్వే జోన్ ముఖ్య కార్యాలయానికి శంకుస్థాపన చేసుకున్నామని వివరించారు. విశాఖ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపన చేశారన్నారు. ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మార్చే ప్రాజెక్టులు వచ్చాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించే అవకాశం తనకు రావడం ఆనందంగా ఉందన్నారు.
Also Read: జీహెచ్ఎంసీ ఎదుట మెరుపు ధర్నా.. కాంట్రాక్టర్ ఆత్మహత్యాయత్నం
సీఎం చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు వస్తు బ్రాండ్ ఇమేజ్‌ను పెంచే విధంగా ముందుకు వెళ్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఐటీతోపాటు డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సైతం ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. చంద్రబాబు రాష్ట్రంలో యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని ఈ సందర్భంగా యువతకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపు నిచ్చారు.
For AndhraPradesh News And Telugu News
Updated Date - Jan 09 , 2025 | 04:23 PM