CM Chandrababu: తమాషాలొద్దు... పద్దతి మార్చుకోండి..
ABN, Publish Date - Jan 09 , 2025 | 02:21 PM
CM Chandrababu: బైరాగిపట్టెడలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం.. కలెక్టర్, ఎస్పీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు కేటాయించిన పోలీసు అధికారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్పారని అడిగారు. ఇది క్షమించాల్సిన తప్పు కాదన్నారు. టికెట్లు పంపిణీ కేంద్రంలో తొక్కిసలాటల నియంత్రణకు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు.
తిరుపతి, జనవరి 9: తిరుపతి తొక్కిసలాట (Tiruapti Stampede_ ప్రాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) పరిశీలించారు. కాసేపటి క్రితమే రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి సీఎం చేరుకున్నారు. బైరాగిపట్టెడలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన.. కలెక్టర్, ఎస్పీపై, అలాగే టీటీడీ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధులు కేటాయించిన పోలీసు అధికారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్పారని అడిగారు. ఇది క్షమించాల్సిన తప్పు కాదన్నారు. టికెట్లు పంపిణీ కేంద్రంలో తొక్కిసలాటల నియంత్రణకు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. ఇంతమంది అధికార యంత్రాంగం ఉండి టికెట్ల పంపిణీ ఎందుకు సవ్యంగా చేయలేకపోయారు?.. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో ఎన్ని టికెట్లు జారీ చేశారు... ఘటనా స్థలానికి అంబులెన్స్ ఎన్ని గంటలకు వచ్చిందంటూ వరుసగా సీఎం ప్రశ్నలు సంధించారు. భక్తుల రద్దీ పెరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని.. పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోవాలని హెచ్చరించారు. బాధ్యత తీసుకున్నవారు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. పరిమితికి మించి భక్తులను లోపలికి ఎందుకు పంపించారని అడిగారు. భక్తులను బయటకు వదిలేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.
‘‘ఇది పద్ధతి కాదు, పద్ధతి ప్రకారం పని చేసేది నేర్చుకోండి . మీరు సమాధానం చెప్పండి. ఈ కేంద్రం వద్ద ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా... పద్ధతి ప్రకారం నడుచుకోండి . తమాషాలనుకోవద్దు.. బాధ్యతలు తీసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నో ఎక్స్క్యూజ్. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి. ఎందుకు జరిగిందో చెప్పండి. భక్తులను ఉంచేందుకు కొత్త ప్లేస్ ఎంపిక చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఇక్కడ నియమించిన పోలీస్ ఆఫీసర్‌కు జాగ్రత్తలు చెప్పారా. ఆ గేటు తీస్తే తొక్కిసలాట జరుగుతుందని ఎందుకు ఊహించలేదు’’ అంటూ కలెక్టర్‌పై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి...
TTD EO: తిరుపతిలో తొక్కిలాటపై టీటీడీ ఈవో ఏమన్నారంటే..
Tirupati Stampede: తిరుపతి ఘటన మృతులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సర్కార్
Read Latest AP News And Telugu News
Updated Date - Jan 09 , 2025 | 02:51 PM