Tirumala: తిరుమలలో మరో ప్రమాదం.. ఏం జరిగిందంటే
ABN, Publish Date - Jan 13 , 2025 | 04:47 PM
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో వస్తున్న ఆర్టీసీ బస్సు 12వ కిలోమీటర్ వద్ద హరిణికి సమీపంలో బ్రేక్ వేయడంతో అదుపుతప్పి అక్కడే ఉన్న రక్షణ గోడను ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు రక్షణ గోడను ఢీకొట్టిన నేపథ్యంలో బస్సు పూర్తిగా రోడ్డుకు అడ్డంగా తిరిగిపోయింది.
తిరుమల, జనవరి 13: తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం నాడు హరిణి వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురు భక్తులు, ఉద్యోగులకు గాయాలయ్యాయి. బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో దాదాపు ఎనిమిది కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకుని బస్సును రోడ్డుకు అడ్డం తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రేన్‌తో బస్సును తొలగించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
కాగా.. తిరుమలలో ఈరోజు భారీగా వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్డులో వస్తున్న ఆర్టీసీ బస్సు 12వ కిలోమీటర్ వద్ద హరిణికి సమీపంలో బ్రేక్ వేయడంతో అదుపుతప్పి అక్కడే ఉన్న రక్షణ గోడను ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, ఉద్యోగులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు రక్షణ గోడను ఢీకొట్టిన నేపథ్యంలో బస్సు పూర్తిగా రోడ్డుకు అడ్డంగా తిరిగిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరికాసేపట్లో రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అయితే బస్సులో ప్రయాణిస్తున్న భక్తుల్లో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి సిబ్బంది తరలించారు. వారికి రుయా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. తిరుమలలో వర్షం కారణంగా ఘాట్‌లో రోడ్డుపై వెళ్లే వాహనాల్లో ఆయిల్ రహదారిపై పడటంతో అదే సమయంలో అక్కడకు వచ్చిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ బ్రేక్ కొట్టగా.. బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.
Viral: బుద్ధిగా వెళ్తున్న ఏనుగును రెచ్చగొట్టాడు.. అంతలోనే
అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలను అధికారులు వెల్లడించాల్సి ఉంటుంది. అయితే బస్సు డ్రైవర్ వేగంగా నడపడం, బ్రేక్ వేయడం వల్ల ప్రమాదం జరిగిందని బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు చెబుతున్న మాట. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌కు కూడా గాయాలయ్యాయి. బస్సులో ముందు వరసగా ఉన్న వారు తీవ్రంగా గాయపడగా.. వెనక కూర్చున వారు స్వల్పంగా గాయపడ్డారు. సడన్‌గా బ్రేక్ కొట్టడం వల్లే బస్సులో ముందు ఉన్న రాడ్‌కు కొట్టడంతో చాలా మందికి మూతిపైనే గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా కూడా ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
కశ్మీర్‌లో జెడ్-మోడ్ టన్నెల్ ప్రారంభం..
పండగపూట బిగ్ షాక్.. ఆ ప్రాంతాల్లో వాటర్ బంద్..
Read Latest AP News And Telugu News
Updated Date - Jan 13 , 2025 | 04:53 PM