ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tirupati: మోహన్ బాబు కాలేజ్ వద్ద ఉద్రిక్తత

ABN, Publish Date - Jan 15 , 2025 | 12:48 PM

తిరుపతిలో మోహన్‌బాబు కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ కాలేజీకి వస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది కాలేజీ గేట్లు మూసివేసి ఎవరినీ లోపలకు రాకుండా కట్టుదిట్టం చేశారు. మీడియాను కూడా అక్కడ నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది హుకుం జారీ చేసింది. మనోజ్ రాకపై అలర్ట్ అయిన పోలీసులు.. భద్రతా కట్టుదిట్టం చేశారు.

Mohan Babu College

తిరుపతి: దర్శక, నిర్మాత, నటుడు మంచు మోహన్ బాబు (Mohan Babu) తిరుపతి (Tirupathi)లో కాలేజ్ (College) వద్ద ఉద్రిక్తత (Tension) చోటు చేసుకుంది. మోహన్‌బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ (Manchu Manoj) కాలేజీ వద్దకు వస్తాడన్న సమాచారంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. కాలేజీ గేట్లు మూసి వేసి.. పరిసర ప్రాంతాలకు ఎవరినీ అనుమతించడం లేదు. మీడియా (Media)ను సయితం అక్కడ నుంచి వెళ్లిపోవాలని భద్రతా సిబ్బంది హుకుం జారీ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు (Police) కూడా కాలజీ వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే కాలేజీ వద్ద మోహన్ బాబు, మంచు విష్ణు ఉన్నారు. దీంతో మనోజ్ రాకపై అలర్ట్ అయిన పోలీసులు.. భద్రతా కట్టుదిట్టం చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా మంచు ఫ్యామిలీలో ఇటీవల వరసగా కీలక పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మోహన్ బాబు చిన్న కుమారుడు, హీరో మంచు మనోజ్ వ్యవహార శైలితో.. ఆ కుటుంబంలో వివాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ అన్నట్లుగా పరిస్థితి మారింది.

ఈ వార్త కూడా చదవండి..

తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు కనుమ శుభాకాంక్షలు..


నెల రోజుల క్రితం మంచు ఫ్యామిలీలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ క్రమంలో మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య ఏదో జరుగుతుందంటూ ప్రచారం జరిగింది. దీంతో శంషాబాద్ మండలంలోని జల్‌పల్లిలో మోహన్ బాబు నివాసంలోకి మంచు మనోజ్ బలవంతంగా వెళ్లారు. ఆ తర్వాత మోహన్ బాబు ఆడియో క్లిప్ విడుదల చేశారు. అదే సమయంలో మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు.. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చారు. ఇంతలో విలేకర్ల సమావేశంలో మంచు మోహన్ బాబు సీరియస్ అయ్యారు. ఆ క్రమంలో ఓ మీడియా ఛానెల్ జర్నలిస్ట్‌పై ఆయన దాడి చేశారు. ఈ ఘటనపై జర్నలిస్ట్‌లు నిరసన బాట చేపట్టారు. ఈ నేపథ్యంలో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో మోహన్ బాబుపై హత్యయత్నం కేసు నమోదు అయింది. ఆ కేసు ఇంకా నడుస్తున్న విషయం తెలిసిందే.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆయనకు త్రివర్ణ పతాకంపై గౌరవం లేదు: రాహుల్

నాగాలమ్మ గుడిలో సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన.. షెడ్యూల్ ఇదే..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 15 , 2025 | 12:48 PM