TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ చైర్మన్ కీలక సూచనలు
ABN, Publish Date - Jan 08 , 2025 | 12:41 PM
Andhrapradesh: పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులకు ఒకే రకమైన సిద్దిఫలాలు లభిస్తాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఏకాదశి పర్వదినం రోజున ఉదయం 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి స్వర్ణ రథంపై భక్తులకు దర్శనం ఇస్తారన్నారు.
తిరుమల, జనవరి 8: ఈనెల 10 వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ (TTD) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వైకుంఠ ఏకాదశి (vaikuntha Ekadashi) సందర్భంగా దాదాపు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచే ఉంచనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా చర్యలు తీసుకుంది టీటీడీ. వైకుంఠా ఏకదాశిపై తాజాగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎల్లుండి (జనవరి 10) నుంచి 19 వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు. పది రోజులు పాటు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తులకు ఒకే రకమైన సిద్దిఫలాలు లభిస్తాయని తెలిపారు. ఏకాదశి పర్వదినం రోజున ఉదయం 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి స్వర్ణ రథంపై భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాహన మండపంలో భక్తులకు ఉత్సవమూర్తుల దర్శనం కల్పిస్తామని చెప్పారు. రేపు తిరుపతి, తిరుమలలో ఏర్పాటు చేసిన 91 కౌంటర్లలో 1.2 లక్షల దర్శన టోకెన్లను భక్తులకు జారీ చేయనున్నట్లు తెలిపారు.
10 రోజుల పాటు కేవలం దర్శన టిక్కెట్లు, టోకెన్స్ కలిగిన భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తామని టీటీడీ చైర్మన్ వెల్లడించారు. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులు స్వయంగా విచ్చేస్తేనే వీఐపీ బ్రేక్ దర్శనాలు కల్పిస్తామన్నారు. 10 రోజులు పాటు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేశామని.. అలాగే 10 రోజులు పాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
IT Raids: హన్సిత, అనిల్ కేస్.. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు
3 వేల సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ ద్వారా భధ్రతా పర్యవేక్షణ చేస్తామన్నారు. భక్తులకు కేటాయించిన టైం స్లాట్ మేరకు క్యూ లైనులు వద్దకు చేరుకోవాలని కోరారు. ఎల్లుండి దర్శనానికి ఇప్పటికే భక్తులు క్యూ లైన్ల వద్దకు చేరుకుంటున్నారని తెలిపారు. తిరుమలకు రావద్దని కొంత మంది ర్యూమర్స్ ప్రచారం చేస్తూన్నారని.. భక్తులు వాటిని నమ్మవద్దని అన్నారు. హెచ్ఎంపీవి వైరస్ నేపథ్యంలో భక్తులు మాస్కులు ధరించి రావాలని విజ్ఞప్తి చేస్తున్నామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం
వావ్.. ఇది సాధారణ గుర్రం కాదు.. అసాధారణ ట్యాలెంట్..
Read Latest AP News And Telugu news
Updated Date - Jan 08 , 2025 | 01:21 PM