ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP News: టీటీడీ పాలకమండలి తరఫున క్షమాపణలు చెబుతున్నా: బీఆర్ నాయుడు..

ABN, Publish Date - Jan 10 , 2025 | 08:22 PM

తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ తప్పిదం లేకపోయినప్పటికీ పాలకమండలి తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలను స్వీకరిస్తున్నట్లు బీఆర్ నాయుడు చెప్పారు.

TTD Chairman BR Naidu

తిరుమల: తిరుపతి (Tirupati) తొక్కిసలాట ఘటనలో టీటీడీ తప్పిదం లేకపోయినప్పటికీ పాలకమండలి తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) తెలిపారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) సూచనలను స్వీకరిస్తున్నట్లు బీఆర్ నాయుడు చెప్పారు. భవిష్యత్తులో అన్ని విషయాలను అధికారులకు వదిలేయకుండా జాగ్రత్త పడతామని ఆయన తెలిపారు. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతిచెందడం, పలువురికి గాయాలు కావడం దురదృష్టకరమని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఎంతో బాధపడ్డారని బీఆర్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. "తిరుపతి తొక్కిసలాట ఘటన కొంతమంది అధికారుల తప్పిదం వల్లే జరిగింది. ఈ ఘటనలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. వేంకటేశ్వరస్వామికి సీఎం చంద్రబాబు ప్రథమ భక్తుడు. నేను ఎవరితోనైనా పెట్టుకుంటానని, కానీ స్వామివారితో పెట్టుకోనని ఆయన చాలాసార్లు చెప్పారు. తోపులాట ఘటనపై ముఖ్యమంత్రి చాలా బాధపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచనలను కచ్చితంగా పాటిస్తాం. బోర్డు తప్పిదం లేకపోయినా.. పాలకమండలి తరఫున క్షమాపణలు చెబుతున్నాం. ఇకపై జరిగే ప్రతి కార్యక్రమంలోనూ పాలకమండలి భాగస్వామ్యం అవుతుంది. కొందరు అధికారుల అత్యుత్సాహం వల్ల జరిగిన ఘటన ఇది. అధికారులూ క్షమాపణ చెప్పాలి. వాళ్లు చెప్పకపోతే వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నాం. టీటీడీకి బోర్డే సుప్రీం.. సీఎం చంద్రబాబు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను అధికారులు అమలు చేయాలి. ముఖ్యమంత్రి దృష్టికీ ప్రతి సమస్యను తీసుకెళ్తున్నామని" చెప్పారు.


తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పిఠాపురం వేదికగా మరోసారి స్పందించారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాట జరగడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అధికారులు కచ్చితంగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా తానే చెప్పానని, మీకేంటి నామోషి అంటూ పవన్ ప్రశ్నించారు. దీంతో మీడియా సమావేశం పెట్టిన టీటీడీ ఛైర్మన్.. పాలకమండలి తరఫున బహిరంగ క్షమాపణలు చెప్పారు.


మరోవైపు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు టీటీడీ పాలకమండలి శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన ఆరుగురు భక్తులకు ఒక్కొక్కరికీ రూ.25 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అలాగే కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇచ్చేందుకు పాలకమండలి నిర్ణయించినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరికి రూ.5 లక్షలు చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించారు. స్వల్పంగా గాయపడిన 21 మందికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపారు. మృతులు, క్షతగాత్రుల పిల్లలకు ఉచిత విద్య అందించాలని నిర్ణయించినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. జ్యుడీషియల్ ఎంక్వయిరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇకపై ఎస్డీ టోకెన్లు తిరుపతిలోనే ఏ రోజుకారోజు కేటాయిస్తామని బీఆర్ నాయుడు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అంతరిక్షంలో త్రీగోర్జెస్ డ్యామ్ నిర్మాణానికి చైనా అడుగులు

జగనన్న కాలనీల పేరు మార్చిన ప్రభుత్వం

Updated Date - Jan 10 , 2025 | 09:43 PM