TTD: చైర్మన్‌కు నాకు మధ్య ఎలాంటి విభేదాలు లేవు: ఈవో శ్యామలరావు
ABN, Publish Date - Jan 13 , 2025 | 01:15 PM
వైకుంఠ ఏకాదశి సందర్బంగా తిరుపతిలో టీటీడీ అధికారులు ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్లవద్ద తొక్కిసలాట జరిగి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన టీటీడీ అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఈవో శ్యామలరావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బైరాగిపట్టెడలో భక్తులను అనుమతించే సమయంలో కొన్ని లోపాలు జరిగాయని అన్నారు.
తిరుమల: టీటీడీ (TTD)లో సమన్వయ లోపం లేదని, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఛైర్మనే కీలకమని.. పాలకమండలిలో చర్చించి తీసుకున్న నిర్ణయాలను అధికారులు అమలు చేస్తారని ఈవో శ్యామలరావు (EO Syamalarao) పేర్కొన్నారు. ఇటీవల తిరుపతి (Tirupati)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగి ఆరుగురు దుర్మరణం చెందారు. అయితే ఇదంతా ఈవో నిర్లక్ష్యంవల్లే జరిగిందనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ..బైరాగిపట్టెడలో భక్తులను అనుమతించే సమయంలో కొన్ని లోపాలు జరిగాయని అన్నారు. అయితే చైర్మన్‌కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. తాను ఎవరితోనూ అమర్యాదగా మాట్లాడనని.. గత ఆరు నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. మొన్న జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారుర. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు.
ఈ వార్త కూడా చదవండి
నారావారిపల్లెలో సీఎం చంద్రబాబు..
తిరుపతిలో తొక్కిసలాట
కాగా ‘తిరుమల’ చరిత్రలోనే తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. రద్దీ సమయాల్లో తొక్కిసలాటలు జరగడం సాధారణమే అయినప్పటికీ... తొలిసారిగా, ఆ దశ దాటి భక్తుల మరణాలూ సంభవించాయి. గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనుండగా... తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్లే మృత్యు వేదికలయ్యాయి. సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు... తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో ఏకంగా 90 టోకెన్ జారీ కౌంటర్లను ఏర్పాటు చేశారు. బుధవారం (8వ తేదీ) రాత్రి ఇలా గేట్లు తెరవగానే అలా భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో... పలుచోట్ల తొక్కిసలాట జరిగింది. అందులో... బైరాగిపట్టెడ కేంద్రం వద్ద పరిస్థితి మరింత విషమించింది. రద్దీలో ఇరుక్కుపోయిన భక్తులు ఊపిరాడక అల్లాడిపోయారు. మహిళలు మరింత విలవిలలాడారు. ఈ విషాదంలో ఆరుగురు మరణించగా... వారిలో ఐదుగురు మహిళలే. తొక్కిసలాటలో పెద్దసంఖ్యలో భక్తులు గాయపడ్డారు. వారికి తిరుపతిలోని స్విమ్స్, రుయా ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తొక్కిసలాటల్లో గాయపడటం వంటి ఘటనలు జరిగినప్పటికీ... మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబనాబు నాయుడు టీటీడీ అధికారులపై సీరియస్ అయ్యారు. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.
తిరుపతిలో ఈ నెల ఎనిమిదో తేదీన జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను ఆదివారం టీటీడీ పాలకమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. ఈ తొక్కిసలాటలో విశాఖలోని మద్దిలపాలేనికి చెందిన గుడ్ల రజని, సూరిశెట్టి లావణ్య, కందిపల్లి శాంతి, అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన బొడ్డేటి నాయుడుబాబు మృతిచెందారు. గుడ్ల రజని భర్త లక్ష్మణరెడ్డి, కందిపల్లి శాంతి భర్త వెంకటేశ్, లావణ్య భర్త సతీశ్, వారి పిల్లలకు హోం మంత్రి వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జ్యోతుల నెహ్రూ బాధిత కుటుంబాల ఇళ్లకు స్వయంగా వెళ్లి రూ.25 లక్షల చొప్పున చెక్కులను అందించారు. నర్సీపట్నం మునిసిపాలిటీలోని పెదబొడ్డేపల్లిలో బొడ్డేడ నాయుడుబాబు భార్య మణికుమారికి రూ.25 లక్షల చెక్కును శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అందజేశారు. గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున చెక్కులను టీటీడీ ట్రస్టు బోర్డు సభ్యులు, స్థానిక ఎమ్మెల్యేలు కలిసి అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప.గో. జిల్లా: సంక్రాంతి కోడి పందాలకు సర్వం సిద్ధం
సూర్యాపేట: సైకో భర్తను హతమార్చిన భార్యలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Jan 13 , 2025 | 01:15 PM