CM Chandrababu: 21,850 మందితో సూర్యవందనం అభినందనీయం
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:53 AM
అరకు వేదికగా 21,850 మంది మహా సూర్యవందనంలో పాల్గొని రికార్డు సాధించిన గిరిజన విద్యార్థుల్ని, కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారుల్ని సీఎం చంద్రబాబు అభినందించారు. కడపకి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణీని మంత్రి నారా లోకేశ్ అభినందించారు

అమరావతి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): అరకు వేదికగా 21,850 మంది ఒక చోట చేరి మహా సూర్యవందనం కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేసి రికార్డు సృష్టించిన గిరిజన విద్యార్థులను, కార్యక్రమాన్ని స్ఫూర్తిమంతంగా నిర్వహించిన అధికారులను ఆయన ఎక్స్ వేదికగా అభినందించారు.
శ్రీచరణీకి లోకేశ్ అభినందనలు
ట్రై నేషన్ మహిళా క్రికెట్ సిరీ్‌సకు ఎంపికైన కడపకు చెందిన ఏపీ మహిళా క్రికెటర్ ఎన్.శ్రీచరణీని ఎక్స్‌లో మంత్రి నారా లోకేశ్ అభినందించారు. ట్రై సిరీస్ వన్‌డే ఇంటర్నేషనల్‌లో చోటు దక్కించుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్ర క్రికెట్‌కు బిగ్ మూమెంట్ అని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు..
సీతమ్మవారికి తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే
For More AP News and Telugu News