Share News

Aqua Farming: ఆక్వా పై కమిటీ

ABN , Publish Date - Apr 08 , 2025 | 03:54 AM

అమెరికా సుంకాల వల్ల నష్టపోతున్న ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారు. కమిటీ ఏర్పాటుతో పాటు రైతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వ సహాయాన్ని హామీ ఇచ్చారు.

Aqua Farming: ఆక్వా పై కమిటీ

ప్రస్తుత సంక్షోభానికి పరిష్కారం

భవిష్యత్‌ ప్రణాళికపై సూచనలు

100 కౌంట్‌కు రూ.220 తగ్గకుండా కొనండి

సాగుకు ఫ్రెష్‌ వాటర్‌ ఇస్తాం: చంద్రబాబు

ఇతర దేశాలతో చర్చించేలా కేంద్రంతో మాట్లాడతా

ఆక్వా రంగ భాగస్వాములతో సీఎం సమీక్ష

అమరావతి, ఏప్రిల్‌ 7(ఆంధ్రజ్యోతి): అమెరికా సుంకాల కారణంగా నష్టపోతున్న ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. అమరావతి సచివాలయంలో సోమవారం ఆక్వా రైతులు, ఆక్వా రంగ భాగస్వాములు, ఎగుమతిదారులు, అధికారులతో సీఎం చర్చించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అమెరికా సుంకాల కారణంగా నష్టపోయే ఆక్వా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమస్య పరిష్కారానికి భాగస్వామ్యపక్షాలతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత సమస్యకు పరిష్కారం చూపి, భవిష్యత్‌ ప్రణాళిక రూపొందించేందుకు ఈ కమిటీ సూచనలు చేస్తుందన్నారు. ఆక్వా రైతులు, నిపుణులు, అధికారులు, ఎంపెడా ప్రతినిధులు, ఎగుమతిదారులతో కమిటీ సమావేశమై సమస్య పరిష్కారానికి సూచనలు, భవిష్యత్‌ ప్రణాళికపై సలహాలు ఇస్తుందని తెలిపారు.

hg.gif

సాగుకు ఫ్రెష్‌ వాటర్‌.. రూ.220 ధర

ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఆక్వా రంగాన్ని కొత్త సుంకాలు మరింత సంక్షోభంలోకి తీసుకెళతాయని రైతులు, ఎగుమతిదారులు తెలిపారు. ఈక్విడార్‌ వంటి దేశాలు అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. అమెరికాతో సత్వర సంప్రదింపులు జరిపేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడనున్నారు. ఆక్వాకు ఫ్రెష్‌ వాటర్‌ ఇవ్వడం వల్ల వైరస్‌, వ్యాధులు తగ్గి పంట నాణ్యత మెరుగుపడుతుందని రైతులు చెప్పగా.. దీనికి సీఎం అంగీకారం తెలిపారు. ధర తగ్గకుండా చూడాలని రైతులు కోరగా, 100 కౌంట్‌ రొయ్యలను 220 ధరకు కొనుగోలు చేయాలని వ్యాపారులకు నిర్దేశించారు. సౌత్‌ కొరియా, ఈయూ దేశాలతో ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయని ఎగుమతిదారులు చెప్పగా.. దీనిపై కేంద్రంతో మాట్లాడతామని సీఎం చెప్పారు. ఇప్పటికే లేఖ ద్వారా కేంద్రం దృష్టికి తెచ్చామని, సంప్రదింపులు జరుపుతామని అన్నారు.


కమిటీ నిర్ణయం మేరకే క్రాప్‌ హాలీడే

అమరావతి సచివాలయంలో ఆక్వా రంగ సమస్యలపై సీఎం సమీక్ష అనంతరం ఆక్వా రంగ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు. ఆక్వా డెవల్‌పమెంట్‌ అథారిటీ చైర్మన్‌ ఆనం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సంక్షోభం నుంచి ఎలా బయటపడాలనే దానిపై కమిటీ అధ్యయనం చేసి వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని చెప్పారు. క్రాప్‌ హాలీడే ప్రకటించే విషయాన్ని కూడా కమిటీ చర్చిస్తుందని ఆక్వా రైతు ప్రతినిధి కుమార్‌రాజా చెప్పారు. కొద్దిరోజులు సంయమనం పాటించి సమయానికి అనుగుణంగా ఆక్వా పంట తీయాలని (హార్వెస్టింగ్‌) సీఎం సూచించినట్లు ఎగుమతిదారు ఆనంద్‌ తెలిపారు.


ఇవి కూడా చదవండి..

TGSRTC: ఎండీకి నోటీసులు.. మోగనున్న సమ్మె సైరన్

Vaniya Agarwal: మైక్రోసాఫ్ట్‌ను అల్లాడించిన వానియా అగర్వాల్ ఎవరు

Rains: ఓరి నాయనా.. ఎండలు మండుతుంటే.. ఈ వర్షాలు ఏందిరా

Student: వారం పాటు.. వారణాసిలో దారుణం..

Mamata Banerjee: హామీ ఇస్తున్నా.. జైలుకెళ్లేందు సిద్ధం..

Nara Lokesh: ‘సారీ గయ్స్‌..హెల్ప్‌ చేయలేకపోతున్నా’: మంత్రి లోకేశ్‌

LPG Price Hiked: పెరిగిన సిలిండర్ ధర.. ఎంతంటే..

Updated Date - Apr 08 , 2025 | 03:55 AM