ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan: పిఠాపురం పర్యటనకు డిప్యూటీ సీఎం.. మినీ గోకులం ప్రారంభించనున్న పవన్..

ABN, Publish Date - Jan 10 , 2025 | 08:42 AM

కాకినాడ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ శుక్రవారం పిఠాపురం పర్యటనకు రానున్నారు. నియోజకవర్గంలో పర్యటించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. పిఠాపురంలో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

కాకినాడ: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (Deputy CM), జనసేన అధినేత (Janasena Chief) పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) శుక్రవారం పిఠాపురం (Pithapuram) పర్యటనకు (visit) రానున్నారు. నియోజకవర్గంలో పర్యటించి.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఉదయం 9.10 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి వస్తారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన రాజానగరం, రంగంపేట, పెద్దాపురం, సామర్లకోట ఏడీబీ రోడ్డు మీదుగా ప్రయాణిస్తారు. దారిలో పలుచోట్ల రహదారి గుంతలను పరిశీలిస్తారు. ఇటీవల గేమ్ చెంజర్ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వెళ్లి వస్తూ ఈ రహదారి గుంతల్లో పడి ఇద్దరు మృతి చెందిన నేపథ్యంలో పవన్ పరిశీలిస్తారు. 11.45 గంటలకు పిఠాపురం మండలం కుమారపురంకు వస్తారు. ఉపాధి హామీ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులాలకు ఆయన ప్రారంభోత్సవం చేస్తారు. 12.25 గంటలకు పిఠాపురం పాతబస్టాండ్ మునిసిపల్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలకు హాజరవుతారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 3.30 గంటలకు బయలుదేరి రాజమహేంద్రవరం ఎయర్ పోర్టుకు చేరుకుని.. అక్కడినుంచి మంగళగిరి క్యాంపు కార్యాలయానికి వెళతారు.

ఈ వార్త కూడా చదవండి:

చర్లపల్లి నుంచి పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు


డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కాకినాడ జిల్లా కలెక్టర్‌ షాన్‌ మోహన్‌, జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. పిఠాపురం మండలం మల్లాంలోని గోకులం, విరవాడ, చేబ్రోలు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల ఆవరణలను, పిఠాపురం ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానాన్ని కలెక్టరు పరిశీలించారు. ప్రారంభోత్సవాల అనంతరం పవన్ కల్యాణ్ పిఠాపురం ప్రభుత్వాసుపత్రిని సందర్శించే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీ మహావిష్ణు రూపంలో భద్రాద్రి రామయ్య..

తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు..

అప్పుడు ఇల్లే వైకుంఠం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 10 , 2025 | 08:42 AM