Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...
ABN , Publish Date - Feb 02 , 2025 | 11:09 AM
కాకినాడ జిల్లా కిర్లంపూడి లో ముద్రగడ పద్మనాభ రెడ్డి నివాసం ముందు ఓ యువకుడు మద్యం సేవించి హల్ చల్ చేశాడు. ఆదివారం తెల్లవారుజామున ట్రాక్టర్‌తో వచ్చి బీభత్సం సృష్టించాడు. ర్యాంపుపై పార్కింగ్ చేసిన కారును ట్రాక్టర్తో ధ్వంసం చేశాడు.

కాకినాడ జిల్లా: కిర్లంపూడిలో వైసీపీ నేత (YSRCP Leader), మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి (Mudragada Padmanabha Reddy) నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం సృష్టించాడు. ఆదివారం తెల్లవారు జామున గన్నిశెట్టి గంగాధర్ (Gannishetty Gangadhar ) అనే యువకుడు మద్యం సేవించి.. ట్రాక్టర్ (Tractor)తో వచ్చి బీభత్సం సృష్టించాడు. ముద్రగడ కాంపౌండ్‌లో పార్కింగ్ చేసిన కారుతో పాటు ఫ్లెక్సీలు ధ్వంసం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ముద్రగడ నివాసానికి చేరుకుని గంగాధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. దీని వెనుక ఎవరైనా ఉన్నారా.. లేక గంగాధర్ కావాలనే ముద్రగడ నివాసం వద్ద భీభత్సం సృష్టించాడా అన్న దానిపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ముద్రగడ అనుచరులు ఆయన నివాసానికి చేరుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఈ వార్త కూడా చదవండి..
ఢిల్లీలోని సహద్రలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
కాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘోర పరాజయం పాలైన విషయం అందరికీ తెలిసిందే. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ జిల్లాలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ అనుబంధ విభాగాలు, జిల్లా అధ్యక్షులతో పాటుగా అవసరమైన చోట్ల నియోజకవర్గాల్లో ఇంఛార్జ్‌లను మార్చారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి కుమారుడు ముద్రగడ గిరికి ప్రమోషన్ ఇచ్చారు. గిరికి కీలక బాధ్యతల్ని అప్పగించారు.. ఆయనను కాకినాడ జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ముద్రగడ గిరిని నియమించారు. అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో గిరికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ముద్రగడ పద్మనాభం గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో కీలక నేతగా ఉన్నారు.. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2014-2019 ఎన్నికల్లో కాపు ఉద్యమ నేతగా కీలక బాధ్యతలు నిర్వహించారు.. అనంతరం ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత కాపులకు రిజర్వేషన్ల కోసం వరుసగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖలు రాశారు.. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. అయితే 2024 ఎన్నికల సమయంలో ముద్రగడ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావించారు. అయితే జనసేన పార్టీలోకి వెళతారని ప్రచారం జరిగింది. జనసేన నుంచి ఆహ్వానం రాకపోవడంతో వైఎస్సార్‌సీపీలో చేరిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
పాతబస్తీ, జీడిమెట్లలో అగ్ని ప్రమాదం..
మద్యం మత్తులో నల్లవాగులో పడి ఇద్దరు వ్యక్తుల మృతి..
శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రధసప్తమి వేడుకలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News