పుష్కరాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Mar 16 , 2025 | 12:44 AM
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 15( ఆంధ్రజ్యోతి): రానున్న గోదావరి పుష్కరాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించేందుకు అ ందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియో గం చేసుకోవాలని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని తక్కు వ నీటి వినియోగం- దుర్గం

రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి
రాజమహేంద్రవరం సిటీ, మార్చి 15( ఆంధ్రజ్యోతి): రానున్న గోదావరి పుష్కరాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించేందుకు అ ందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియో గం చేసుకోవాలని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని తక్కు వ నీటి వినియోగం- దుర్గంధంలేని టాయిలెట్స్ ఏర్పాటుపై రోసారి ప్రొఫెషనల్ టీంతో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం న గర పాలక సంస్థ కార్యాలయంలో శనివారం సా యంత్రం ఎంపీ పురందేశ్వరి, కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ నరసింహకిషోర్, కమిషనర్ కేతన్ గార్గ్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేసర్స్ రోసారి ప్రొఫెషనల్‌తో వాటర్ లెస్ ఒడోర్‌లెస్ ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హేమంత్, సత్యనారాయణ వివరించారు. పురందేశ్వరి మాట్లాడుతూ ప్రధాని మోదీ స్వచ్ఛభారత్ స్వచ్ఛ ఆవాస్ కార్యక్రమం కింద విజన్-2047 దిశగా అడుగులు వేస్తు న్నట్టు చెప్పారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా టాయిలెట్స్ ఏర్పాటు చేసే క్రమంలో ప్రకృతి వనరులను సంరక్షించే దిశగా తక్కువ నీటి వినియోగం వాసనలేని టాయిలెట్స్ ఏర్పాటు చేసే ప్రాజెక్ట్ ఆలోచన రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిఽధిలో చేపట్టనున్నట్టు పేర్కొన్నా రు. ఇందుకోసం కంపెనీ ప్రతినిధులతో ప్రాజెక్ట్‌పై సమగ్రంగా చర్చించినట్టు తెలిపారు. ప్రకృతి వనరుల సంరక్షణ వాసనలేని నీరులేని మూత్ర విసర్జన్ పరికరం పరిశుభ్రతను పెంచడమే కాకుండా నీటి వినియోగాన్ని గణనీయం గా తగ్గించడంతో పాటు స్థిరమైన పారిశుధ్య నిర్వహణసామర్థ్యం పెంచడం ఈ ప్రాజెక్ట్‌లో ప్రధాన అంశమని కమిషనర్ వివరించారు.