పండుగ ఆనందం ఆవిరి!
ABN, Publish Date - Jan 13 , 2025 | 01:07 AM
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 12(ఆంధ్ర జ్యోతి): సంక్రాంతి పండగకు పిల్లలకు కొత్త దుస్తులు కొనాలని ఆనందంగా రాజమహేంద్రవరం మార్కెట్‌కు వెళ్తుండగా ప్రమాదం కబళించింది. ఈ ఘటనలో భార్య మృతిచెందగా భర్త తీవ్ర గాయాలపాలై చావుబతుకుల మధ్య కొ ట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. రాజానగరం మండలం దివాన్‌చెరువు గ్రామానికి చెందిన గాడి గోపినాథ్, గాడి మేఘన (35) భార్యాభర్తలు. వారికి ఓ పాప, బాబు. గోపినాథ్ స్థానికం
కొత్త దుస్తులు కొనేందుకు వెళ్తుండగా కబళించిన మృత్యువు
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం
రాజమహేంద్రవరం సిటీ, జనవరి 12(ఆంధ్ర జ్యోతి): సంక్రాంతి పండగకు పిల్లలకు కొత్త దుస్తులు కొనాలని ఆనందంగా రాజమహేంద్రవరం మార్కెట్‌కు వెళ్తుండగా ప్రమాదం కబళించింది. ఈ ఘటనలో భార్య మృతిచెందగా భర్త తీవ్ర గాయాలపాలై చావుబతుకుల మధ్య కొ ట్టుమిట్టాడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. రాజానగరం మండలం దివాన్‌చెరువు గ్రామానికి చెందిన గాడి గోపినాథ్, గాడి మేఘన (35) భార్యాభర్తలు. వారికి ఓ పాప, బాబు. గోపినాథ్ స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్లో ఎలక్ర్టీషియన్‌గా పనిచేస్తున్నాడు. సంక్రాంతి పండుగకు పిల్లలకు దుస్తులు కొనుగోలుచేసేందుకు ఇద్దరూ ఆది వారం సాయంత్రం రాజమహేంద్రవరం బైక్‌పై వెళ్తుండగా స్థానిక ఆటోనగర్ వద్దకు వచ్చేసరికి ఐషర్ వ్యాన్, కారు మధ్యకు వీరి బైక్ రావడంతో వ్యాన్ సైడ్ భాగం బ్యాక్ హ్యాండిల్ తగలడంతో ఇద్దరూ కింద పడిపోయారు. మేఘన వెనకకు పడడంతో తలకు బలమైన అక్కడికక్కడే మృతి చెంది ంది. గోపినాథ్ తలకు తీవ్రగాయా లయ్యాయి. స్థానికులు వెంటనే 108 అం బులెన్స్‌లో అత డిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండ డంతో ప్రైవేట్ ఆసు పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి బొమ్మూరు పో లీసులు చేరుకుని మేఘ న మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. వ్యాన్‌ను, కారును అదుపులోకి తీసుకున్నారు.
సంక్రాంతికి స్వగ్రామం వస్తుండగా..
నిద్ర మత్తులో బైక్ నుంచి జారి పడి యువకుడి మృతి
దేవరపల్లి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి వస్తుండగా మోటార్‌సైకిల్ నుంచి జారిపడి యువకుడు మృతిచెందాడు. పోలీసులు, కు టుంబ సభ్యుల వివరాల ప్రకారం.. హైద రాబాద్ నుంచి బిక్కవోలు మండలం ఊలపల్లి గ్రామం వెళ్తుండగా మార్గం మధ్యలో దేవరపల్లి మండలం సూర్యనారాయణపురం వద్ద ఆదివా రం ఉదయం 5.50గంటలకు మోటార్‌సైకిల్ వెనుక కూర్చున్న కందిపల్లి సత్యనారాయణ (25) నిద్రమత్తులో జారిపడడంతో తలకు తీవ్రగాయమై అక్కడిక్కడే మృతిచెందాడు. సత్యనారాయణ ఉపాధి కోసం ఐదేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లి తాపీ పనిచేస్తుండగా అతడి చిన్నాన్న కందిపల్లి తలుపులయ్య వాచ్‌మేన్‌గా పనిచేస్తున్నాడు. మృతుడి బావ సీహెచ్ కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గోపాలపురం సీహెచ్‌సీకి తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు. కాగా ఇద్దరూ హైదరాబాదులో శనివారం రాత్రి 9గంటలకు బయలుదేరినట్టు పేర్కొన్నారు.
ఊలపల్లిలో విషాధఛాయలు
బిక్కవోలు, జనవరి 12 (ఆంధ్ర జ్యోతి): దేవరపల్లి మండలం సూర్యనారాయణపురం జాతీ య రహదారిపై బైక్ జారి పడి కడిపల్లి సత్యనాయణ(25) మృతి చెందడంతో అతడి స్వగ్రామమైన బిక్కవోలు మండలం ఊలపల్లిలో విషాధఛాయలు అలుముకున్నా యి. గ్రామానికి చెందిన వీరబాబు, అన్నవరం దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు. కుమార్తెకు పెళ్లవ్వడంతో కుమారుడు సత్యనారాయణే తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. తాపీ పని చేసే సత్యనారాయణ హైదరాబాద్ వెళ్లి పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులను తన వద్దే ఉంచుకుంటున్నాడు. ఇటీవల ఊలపల్లిలో ఇల్లు కూడా నిర్మించాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా తల్లిదండ్రులను, ఈ ప్రాంతం నుంచి తాపీ పనికి వచ్చిన వారందరితో వ్యాన్‌లో పంపి సత్యనారాయణ తన బాబాయ్‌తో కలసి బైక్‌పై ఊలపల్లికి వస్తుండగా సూర్యనారాయణపురం వద్ద జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పండుగ పూట ఊలపల్లిలో విషాధఛాయలు అలుముకున్నాయి.
Updated Date - Jan 13 , 2025 | 01:07 AM